iDreamPost
android-app
ios-app

ఇది కదా టెక్నాలజీ వాడకం అంటే..

ఇది కదా టెక్నాలజీ వాడకం అంటే..

మానవ జీవనాన్ని సౌకర్యవంతం చేసింది సాంకేతిక విప్లవం. టెక్నాలజీ అభివృద్ధి పైనే మానవ నాగరికత అభివృద్ధి ఆధారపడి ఉందన్న విషయం చరిత్ర చెబుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకున్న దేశం శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయి. మరో వైపు టెక్నాలజీ అభివృద్ధి చేసుకోవడంలో వెనుకబడి ఉన్న దేశాలు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాయని వర్తమానం చెబుతోంది. మంచికి, చెడుకూ రెండింటికీ టెక్నాలజీ ని ఉపయోగించవచ్చు. ఉపయోగించే విధానాన్ని బట్టి మానవ జీవితం మరింత సౌకర్యవంతం అవుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా ఈ చిత్రం లోని వ్యక్తి నిలుస్తున్నారు. 

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్. సమీపంలోనే సచివాలయం, ఎన్టీఆర్ పార్క్, ప్రసాద్ ఐ మాక్స్, నెక్ల్స్ రోడ్ వంటి ప్రదేశాలతో పర్యాటకులను ఆకర్షించడంలో నగరంలోనే ట్యాంక్ బండ్ ముందు వరసలో ఉంటుంది. మనసును ఆహ్లద పరిచే వాతావరణంలో.. పర్యాటకుల జివ్హా సాఫల్యాన్ని తీర్చే మరమరాల మిక్సర్ అక్కడ లభిస్తుంది. చిన్నపాటి చెక్క స్టాండ్ పై మిక్సర్ అమ్ముకుంటూ జీవనం సాగించేవాళ్ళు ట్యాంక్ బండ్ పై పలువురు ఉంటారు. పది రూపాయలకు ఒక పొట్లం చొప్పున విక్రయాలు జరుపుతున్నారు. కొనుగోలుదారులకు,  తమకు మధ్య చిల్లర సమస్య లేకుండా వారు సులువుగా చెల్లింపులు జరిపేలా టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ.. ఫోన్ ద్వారా చెల్లింపులు జరిపే పేటిఎం , అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే.. వంటి యాప్ లను ఉపయోగిస్తున్నారు. ఒక విక్రయదారుడి వద్దే అన్ని యాప్ లు ఉన్నాయి. ఇది కదా టెక్నాలజీని ఉపయోగించే విధానం..