iDreamPost
iDreamPost
ఒక అబద్దాన్ని పదేపదే ప్రచారం చేస్తే దానినే నిజంగా నమ్మించవచ్చని రెండో ప్రపంచయుద్ధ సమయంలో హిట్లర్ సహాయకుడు గోబెల్స్ అనుసరించిన
థీయరీనే టీడీపీ నాయకులు అనుసరిస్తున్నారు.జన రంజక పాలనతో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలువరించడానికి ఇదొక్కటే మార్గమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. అందుకే తన పెంపుడు మీడియా సాయంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంత మంచి కార్యక్రమం చేపట్టినా అటు పార్టీ నాయకులు, ఇటు వారి సొంతమీడియా రోజుల తరబడి విమర్శలు, ప్రత్యేక ప్రసారాలు, చర్చలతో దుష్ప్రచారం చేస్తున్నారు. అందులో ప్రధానమైనది.. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది, సీఎం జగన్ వల్ల ఏపీ ఆర్థికంగా విధ్వంసం అయింది అన్నది టీడీపీ చాలాకాలంగా చేస్తున్న కుట్రపూరిత ప్రచారం. ఇది అసత్యం అని సీఎం, ఆర్థికమంత్రి, ఇతర మంత్రులు, అధికారులు ఎన్నిసార్లు వివరణలు ఇచ్చినా పచ్చ బ్యాచ్ మాత్రం తన దుష్ప్రచారం ఆపడంలేదు. తాజాగా మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఇదే ప్రయత్నం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ మూడేళ్లపాలనలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేని ఆర్థిక సంక్షోభం నెలకొందని ఆరోపించారు. ఇందుకు కొన్ని తప్పుడు లెక్కలు కూడా ఉదహరించి జనాన్ని మాయ చేద్దామని ట్రై చేశారు.
అప్పును కూడా ఆదాయంగా చూపి విమర్శలు..
బహిరంగ మార్కెట్ రుణాలతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 3 ఏళ్లలో టీడీపీ హయాం కంటే రూ.86,865 కోట్లు అధికమని చెప్పి యనమల అందరినీ ఆశ్చర్య పరిచారు. ఒక పక్క ప్రభుత్వం అప్పులు చేస్తోంది అని విమర్శిస్తూనే బహిరంగ మార్కెట్ రుణాలను కూడా ఆదాయంతో కలిపేసి ఆ సొమ్మంతా ఏమైందని ప్రశ్నించడం విడ్డూరం. రాబడిని, ఖర్చును, అప్పులను వేర్వేరుగా పరిగణనలోకి తీసుకుంటారన్న ప్రాథమిక సూత్రం కూడా తెలియకుండానే యనమల ఆర్థికమంత్రిగా పనిచేశారా? అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
పనితీరులో, వివిధ శాఖల పురోగతిలో మాత్రం అట్టడుగున ఉందని విమర్శిస్తున్న ఆయన ఏ శాఖ టీడీపీ హయాంలో కన్నా వెనుకబడి ఉందో వివరించాలని సవాల్ చేస్తున్నారు. నిర్దిష్టమైన ఆరోపణలు చేయకుండా దొంగలెక్కలు చూపి జనాన్ని తప్పుదోవ పట్టించాలనుకోవడం తగదని సూచిస్తున్నారు. టీడీపీ హయాంలో మూడేళ్లు వరుసగా అనుమతికి మించి రూ.16,418 కోట్లు రుణాలు తేవడమే కాక ఆ మేరకు తర్వాత ఆర్థిక సంవత్సరాల అప్పులు తగ్గించాలని చంద్రబాబు కోరారు. దీంతో ఆ మేరకు వైఎస్సార్ సీపీ సర్కారుకు అప్పును తగ్గించారు. వాస్తవం ఇదైతే ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు చేయడం రాజకీయం కాదా?
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కోవిడ్ ప్రభావం ఏపీపై తక్కువే అంటున్న యనమల జనాభా బాగా తక్కువ ఉన్న రాష్ట్రాలను పోలిక తెచ్చి ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారు. కోవిడ్ వల్ల రెండేళ్లలో రూ.30 వేల కోట్ల లోటు ఏర్పడినా సంక్షేమ పథకాలను కొనసాగించడం, రూ.1.27 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం వల్ల సామాన్యుల కొనుగోలు శక్తి పెరిగింది. అయినా ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందని, పొదుపుశక్తి పూర్తిగా మందగించిందని ఆర్థికమంత్రిగా పనిచేసిన యనమల విమర్శలు చేయడం దివాళాకోరుతనం తప్ప వేరేమీ కాదని అధికారపార్టీ నేతలు అంటున్నారు.
Also Read : పంచాయతీ ఎన్నికల్లో అరాచకాలు జరిగాయట!