Idream media
Idream media
ఆంధ్రపద్రేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించి, రాష్ట్ర వ్యాప్తంగా అలజడికి కారణమైన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు బెయిల్ మంజూరైంది. బుధవారం రాత్రి పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేయగా.. కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. పట్టాభి బెయిల్‌ను తోసిపుచ్చింది. అయితే పట్టాభి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఊరట లభించింది.
పట్టాభి చేసిన వ్యాఖ్యల వల్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యాలయం ముట్టడితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలకు కారణమైన పట్టాభిపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం రాత్రి అతన్ని అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం వైద్యపరీక్షల అనంతరం విజయవాడ మూడో మెట్రోపాలిటన్ చీఫ్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు పట్టాభికి నవంబర్ 4వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో పోలీసులు పట్టాభిని మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు.
Also Read : Remand Report – పట్టాభి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
ప్రస్తుతం పట్టాభి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నాడు. భద్రతాకారణాల రీత్యా శుక్రవారం పట్టాభిని పోలీసులు మచిలీపట్నం సబ్‌జైలు నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. విద్వేషాలు రెచ్చగొట్టాలనే లక్ష్యంతోనే పట్టాభి ఇలాంటి పరుషపదజాలంతో మాట్లాడుతున్నారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఈ తరహా వ్యాఖ్యలు చేసిన కారణంతోనే ఆయనపై నాలుగు కేసులు నమోదయ్యాయని పేర్కొన్న పోలీసులు.. లోతైన దర్యాప్తు చేసేందుకు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో పట్టాభి కూడా తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు పట్టాభికి బెయిల్ ఇచ్చింది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే పట్టాభి జైలు నుంచి బయటపడ్డారు.
Also Read : TDP Pattabhi – పట్టాభి భయపడినట్లు ఏమీ జరగలేదు..!