iDreamPost
iDreamPost
ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి లెక్కలు తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది అని చెబుతున్న టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికే లెక్కలు తెలియవని వైఎస్సార్ సీపీ నాయకులు అంటున్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ పట్టాభి చేసిన విమర్శలను వారు ఖండించారు. కాకినాడకి పట్టిన అవినీతి చీడపురుగు అని ఎమ్మెల్యే ద్వారంపూడిపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న పట్టాభి దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.
అవి ఇతర రాష్ట్రాల బియ్యం అన్న సంగతి తెలియనిది మీకే..
2018-19లో 18.09 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి అయ్యాయి. 2020-21లో 31.51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయ్యాయి. బియ్యం ఎగుమతులు ఎలా పెరిగాయో ద్వారంపూడి సమాధానం చెప్పాలి? అంటున్న పట్టాభి ప్రాథమిక పరిజ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తోపాటు తమిళనాడు, చత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచే ఎగుమతి చేస్తారు. ఈ ఏడాది కూడా రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల బియ్యం ఎగుమతి చేశారు. కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేసిన బియ్యం మొత్తం ఆంధ్రప్రదేశ్ వే అని, అవినీతి జరిగిపోయింది అని మాట్లాడడం అవగాహన రాహిత్యం కాదా? 31.51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేయాలంటే కనీసం 53 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రావాలి.
ప్రభుత్వం కొన్నది ఎంత? మిల్లర్లు కొనుగోలు చేసింది ఎంత? రైతులు వారి కుటుంబ అవసరాలు, విత్తనాల కోసం నిల్వ చేసుకోగా మిగిలేది ఎంత? అసలు రాష్ట్రంలో పండించలేనంత మొత్తం ఎగుమతి చేశారని ఆరోపించడం, రీసైకిలింగ్ చేసి తరలిస్తున్నారు అనడం ఎలా సాధ్యం? ఎగుమతి అవుతున్న
31.51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 80 శాతం పైగా ఇతర రాష్ట్రాల బియ్యం ఉంటుంది. వాస్తవాలు ఇవి కాగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి లెక్కలు తెలియకుండా మాట్లాడుతున్నారని పట్టాభి విమర్శలు చేయడం ఏమిటి? లెక్కలు తెలియనిది ఆయనకే. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కొన్ని పత్రికల్లో వచ్చిన తప్పుడు కథనాలు పట్టుకొని విమర్శలు చేస్తే అబద్దాలు నిజాలు అయిపోతాయా?
ఆధారాలు లేకుండా అవాకులు.. చవాకులు..
ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి. మంత్రితో కలిసి పేదల బియ్యాన్ని దోచుకుంటున్నారు అంటున్న పట్టాభి ఏ ఆధారాలతో అలా మాట్లాడుతున్నారు. దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నట్టు పచ్చ మీడియాలో తప్పుడు కథనాలు రాగానే అవినీతి ఆరోపణలు చేసేయడం ఏం పద్దతి? బియ్యం అక్రమ ఎగుమతులు జరిగిపోయాయి అనడం ఏమిటి? అసలు కాకినాడ పోర్టులో జరిగే బియ్యం ఎగుమతిపై కనీస అవగాహన లేకుండా సీబీఐ విచారణ జరిపించాలి అని పట్టాభి డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. టీడీపీ హయాంలో పనికి ఆహారం బియ్యం ఆ పార్టీ నేతలు మెక్కినట్టు అందరూ తినేస్తారు అనుకోవడం వారి అవినీతి బుద్దిని బయట పెడుతోందని వైఎస్సార్ సీపీ నాయకులు అంటున్నారు.
Also Read : కాకినాడ పోర్టు మీద టీడీపీ నేతలకు కంటగింపుగా ఎందుకు మారింది…