Idream media
Idream media
తప్పు చేసిన వారికి భయం తప్పక ఉంటుంది. కేసు, అరెస్ట్ అంటే.. పోలీసులు కొడతారేమోననే ఆందోళన తప్పు చేసిన వారిని వెంటాడుతుంది. ఆ భయం టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌లోనూ కనిపించింది. ముఖ్యమంత్రిని అసభ్యకరమైన రీతిలో బూతులు తిట్టిన పట్టాభి వల్ల రాష్ట్రంలో రాజకీయ అశాంతి నెలకొంది. టీడీపీ, వైసీపీలు బాహాబాహీకి దిగే పరిస్థితి నెలకొంది. దీంతో తనను అరెస్ట్ చేస్తారని అంచనాకు ముందుగానే పట్టాభి వచ్చారు.
తప్పు చేశాడు కాబట్టి.. పోలీసులు తనను కొడతారని పట్టాభి భయపడ్డారు. అందుకే గతంలో ఎవరూ చేయని విధంగా తనకుతానుగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన పట్టాభి సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఒక వేళ పోలీసులు కొడితే.. ఆ విషయం అందరికీ తెలియజేసేందుకు ముందుగా తన శరీరం ఎలా ఉందో చూపించేందుకు దుస్తులు విప్పి వీడియో తీసిన పట్టాభి, దాన్ని బాహ్య ప్రపంచంలోకి వదిలారు. తన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. అరెస్ట్ అయిన తర్వాత ఏమైనా గాయాలు ఉంటే.. అవి పోలీసులు కొట్టడం వల్ల వచ్చినవని చెప్పేందుకు పట్టాభి తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను నెటిజన్లు తమదైన శైలిలో అభినందిస్తున్నారు.
ఏమైనా, అరెస్ట్ తర్వాత పట్టాభి భయపడినట్లు ఏమీ జరగలేదు. బుధవారం రాత్రి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం వైద్య పరీక్షలకు తీసుకువచ్చారు. అంటే రాత్రి అంతా పోలీస్ స్టేషన్‌లోనే పట్టాభి ఉన్నారు. పోలీసులు కొడతారనే భయం పట్టాభిని వెంటాడుతుండడంతో బహుశా ఆ రాత్రి పట్టాభికి కాళరాత్రి అయి ఉంటుంది. కానీ పట్టాభి భయపడినట్లు అతనిని పోలీసులు కొట్టలేదు. ఈ విషయం పట్టాభినే కోర్టులో న్యాయమూర్తికి తెలిపారు. తనను పోలీసులు కొట్టలేదని చెప్పిన పట్టాభి.. ముఖ్యమంత్రిని తానేమీ దూషించలేదని, రాష్ట్ర ప్రభుత్వ పాలనను మాత్రమే విమర్శించానని చెప్పుకొచ్చారు.
కాగా, పట్టాభికి గురువారం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ను మచిలీపట్నం సబ్ జైలుకు పోలీసులు తరలించారు. అయితే భద్రతాపరమైన కారణాల రీత్యా పట్టాభిని పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే కుట్రతోనే పట్టాభి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు.. సమగ్రంగా విచారించేందుకు పట్టాభిని 5 రోజుల కస్టడీని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో పట్టాభి కూడా బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై ఈ రోజు మధ్యాహ్నం తర్వాత విచారణ జరుగుతుందని సమాచారం.
Also Read : Remand Report – పట్టాభి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు