iDreamPost
android-app
ios-app

Tdp,Nara Lokesh – చినబాబూ.. ఎందుకయ్యా? ఈ రాజకీయం.. తమ్ముళ్లే ఫీలవుతుంటే?

Tdp,Nara Lokesh – చినబాబూ.. ఎందుకయ్యా? ఈ రాజకీయం.. తమ్ముళ్లే ఫీలవుతుంటే?

టీడీపీ చిన బాస్ లోకేష్ తీరు ఇప్పుడు సొంత పార్టీ నేతలను టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే గతం కంటే భిన్నంగా ఇప్పుడు నారా లోకేష్ రాజకీయం ఉన్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ ఎక్కడ మాట్లాడితే పార్టీకి ఇబ్బందులు వస్తాయా? అని కార్యకర్తలు భయ పడేవారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో లోకేష్ దూకుడుగా మాట్లాడి పార్టీకి మరింత టెన్షన్ తీసుకొస్తున్నారని కార్యకర్తలు భయ పడుతున్నారు. అసలు లోకేష్ దూకుడు చూసి సొంత పార్టీ వాళ్లే కాదు, ప్రత్యర్ధులు సైతం ఆశ్చర్యపోతున్నారని బిల్డప్పులు ఇస్తున్నా ,లోకేష్ మాట తీరు సొంత పార్టీకే ఇబ్బంది కరంగా మారనుందని అంటున్నారు. అలాగే ఆయన ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా అధికార వైసీపీనీ ఇరుకున పెట్టే విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసి మునుపెన్నడూ లేని విధంగా దూకుడుగా బూతులు మొదలెట్టారు.

జగన్‌పై అయితే దారుణంగా పరుష పదజాలంతో విరుచుకు పడుతున్నారు. జనం ఏమనుకుంటారు అనే విషయాన్ని కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా, కఠిన పదజాలం వాడుతూ జగన్‌, అధికార పార్టీ నేతలను విమర్శిస్తున్నారు. లోకేష్ సీఎం జగన్‌ ని నేరుగా ఏమీ అనకున్నా ఆయన మాట్లాడుతున్న మాటలు జగన్ ను ఉద్దేశించే బూతులు మాట్లాడుతున్నారని, లోకేష్ కావాల‌ని రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ, వ‌ల్గ‌ర్ భాష‌ను మాట్లాడుతున్నారనే విషయం ఇట్టే అర్థం అవుతోంది. అనంతపురం జిల్లాలో ఎయిడెడ్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థుల అంశం మీద వారిని పరామర్శించేందుకు లోకేష్ బుధవారం ఉదయం అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు.

ఈ క్రమంలోనే ప్రభుత్వం తమపై కేసులు పెడుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేయగా లోకేష్ వారికి ధైర్యం చెప్పి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడి అంతు చూస్తానంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. నా మీదే 11 కేసులు పెట్టారు ఆ నా ** అంటూ దారుణంగా పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తన మీద 11 కేసులు పెట్టారని.. ఇప్పుడు ఇంకో కేసు పెడితే 12 అవుతాయని అంటున్నారు. ఎంతో హుందాగా చేయాల్సిన రాజకీయాన్ని ఇలా బూతులతో నింపేస్తున్న లోకేష్ రాజకీయం ఇలాగే చేస్తారా? ఆయనకు ఇలా తప్ప రాజకీయం చేయడం రావడం లేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Also Read : Muncipal Nominations, Chandrababu, TDP – అడ్డుకుంటే.. అన్ని నామినేషన్లు ఎలా వేశారు బాబూ..?