పాపం.. యువ ఎంపీ.. సతమతమవుతున్నాడు

ఆంధ్రప్రదేశ్‌లో ఓ యువ ఎంపీ పార్లమెంట్‌లో సాటి ఎంపీలు అనుచరిస్తున్న తీరుతో సతమతమవతున్నారట. తోటి ఎంపీలు తమపై ప్రతాపం చూపిస్తున్నారంటూ మీడియా ముందు వాపోతున్నారు. రెండోసారి లోక్‌సభకు ఎన్నికైనా ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ చూడకపోవడడంతో ఆ యువ ఎంపీ బావురుమంటున్నారు. తోటి ఎంపీలు తమపై ప్రతాపం చూపిస్తున్నరంటున్నా ఆ యువ ప్రజా ప్రతినిధి ఎవరో కాదు శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్‌ నాయుడు.

లోక్‌సభలో తాము మాట్లాడుతున్న సమయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమపై ప్రతాపం చూపుతున్నారంటూ రామ్మోహన్‌ నాయుడు మీడియా సాక్షిగా బావురుమన్నారు. 32 ఏళ్ల ఈ యువ ఎంపీ లోక్‌సభకు ఎన్నికవడం ఇదే తొలిసారి కాదు. 2014లోనూ ఎంపీగా గెలిచారు. అయితే అప్పుడు అధికారపక్షం కావడంతోపాటు సంఖ్యాబలం కూడా ఎక్కువగా ఉండడంతో ఆడుతూ పాడుతూ సాగిపోయారు.

అయితే ప్రస్తుతం టీడీపీకి ముగ్గురు సభ్యులే ఉండడం, పైగా ప్రతిపక్షంలో ఉండడంతో రాజకీయలంటే ఎలా ఉంటాయో తెలుస్తోంది. లోక్‌సభలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలను ప్రస్తావిస్తున్న సమయంలో వైఎస్సార్‌సీపీ 22 మంది ఎంపీలు టీడీపీ ఎంపీలకే ఒంటికాలిపై లేస్తున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి సన్నివేశాలు చూడని రామ్మోహన్‌నాయుడుకి అంతా కొత్తగా ఉంటోంది కాబోలు ఒక్క ఘటనకే తెల్లమొహం వేశారు.

2012లో తండ్రి కింజారపు ఎర్రన్నాయుడు అకాల మరణంతో ఆయన వారసుడిగా రామ్మోహన్‌ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి వరకు సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్న రామ్మోహన్‌ నాయుడు 2013లో శ్రీకాకుళం పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే 2014లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. నిన్నమొన్నటి వరకు అధికార రుచిని మాత్రమే చూసిన రామ్మోహన్‌ నాయుడుకి ప్రతిపక్షంలో ఉంటే తగిలే వేడి ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే అనుభంలోకి వస్తోంది. అందుకే పాపం.. అధికార పార్టీ ఎంపీలు తమపై ప్రతాపం చూపిస్తున్నారని వాపోతున్నారు.

పెగా.. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు పోరాడితే తాము మద్ధతిస్తామంటూ రామ్మోహన్‌ నాయుడు బంఫర్‌ ఆఫర్‌ ఇచ్చారు. గత ఐదేళ్లు హోదా పై పల్లెత్తి మాట మాట్లాడకుండా.. ప్యాకేజీయే ముద్దన్న సదరు ఎంపీ.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు చెప్పిన విషయాన్నే ఇప్పుడు చెబుతూ రాజకీయాన్ని ఒంటబట్టించుకుంటున్నారు. ఇంకా నాలుగున్నరేళ్లు ప్రతిపక్షంలో ఉండాలి. ఇంత కాలం అధికారపార్టీ ఎంపీల ప్రతాపాన్ని ఈ యువ ఎంపీ ఎలా తట్టుకుంటారో వేచి చూడాలి.

Show comments