iDreamPost
android-app
ios-app

టీడీపీ నేత‌లు.. కేసులు.. అరెస్టులు…

టీడీపీ నేత‌లు.. కేసులు.. అరెస్టులు…

త‌ప్పుల చిట్టా బ‌య‌ట ప‌డుతోంది. కేసులు.. అరెస్టుల బారిన ప‌డుతున్న తెలుగుదేశం నేత‌ల సంఖ్య పెపెరుగుతూ పోతోంది. ఈఎస్ఐ స్కాం కేసులో అరెస్ట‌యిన అచ్చెన్నాయుడుతో మొద‌లు పెడితే కీలక నేత‌లు హ‌త్య, దాడుల కేసుల స‌హా ప‌లు కేసుల్లో అరెస్టు అవుతూనే ఉన్నారు. తాజాగా టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. పొన్నూరు మండలం చింతలపూడిలో ఆయనను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. సంగం డెయిరీకి సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ధూళిపాళ్లపై 408, 409, 418, 420, 465, 471, 120బి సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆయనను గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు.. సంఘం డెయిరీలో అవకతవకల ఆరోపణలపై విచారిస్తున్నారు. అనంతరం ఏసీబీ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.

మ‌రో కేసులో ఆల‌పాటి..

గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్‌ పరిధిలోని చినకాకాని గ్రామంలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీ, జనరల్‌ ఆసుపత్రి పాలకవర్గంలో వివాదాలు పోలీస్‌స్టేషన్‌ దాకా చేరాయి. ఈ వివాదాల నేపథ్యంలో టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై మంగళగిరి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో పాలకవర్గంలో విభేదాలు తలెత్తడంతో ఎన్‌ఆర్‌ఐ పాలకవర్గంలో డైరెక్టర్‌గా ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సోదరుడు రవిని ఆ పదవి నుంచి తొలగించారు. దీనిపై కోర్టులో కేసు కొనసాగుతోంది. గత టీడీపీ పాలనలో ఆలపాటి ఆసుపత్రి పాలకవర్గాన్ని బెదిరించి తన ఆధిపత్యం కొనసాగించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 2019లో టీడీపీ ఓటమితో ఆలపాటి ఆధిపత్యానికి గండిపడింది. రవిని పాలకవర్గంలోకి తిరిగి తీసుకోకపోతే చంపుతానని రాజేంద్రప్రసాద్‌ బెదిరించారని, అక్రమంగా ఆసుపత్రిలోకి ప్రవేశించి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారని ప్రస్తుత వైస్‌ప్రెసిడెంట్‌ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌ మంగళగిరి రూరల్‌ పోలీసులకు బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మాజీ మంత్రి అజ్ఞానం వీడాల్సిందేనా

మాజీ మంత్రి దేవినేని ఉమాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 29న సీఐడీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే దేవినేని ఉమాకు పలుమార్లు సీఐడీ నోటీసులు పంపించింది. అయితే, దేవినేని ఉమా సీఐడీ విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈనెల 7న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.. కాగా నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు ఈనెల 10న ఉమాపై కేసు నమోదు నమోదు చేశారు. ఈ నెల 7న ప్రెస్ మీట్‌లో సీఎం జగన్ మాట్లాడినట్టు మార్ఫింగ్ వీడియో చూపిన ఉమాపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సీఐడీ నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు ఈనెల 10న ఉమాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీఐడీ.. 464, 465, 468, 469, 470, 471, 505, 120 బీ సెక్షన్ల కింద దేవినేని ఉమాపై కేసు నమోదు చేశారు. ఈ నెల 15, 19న విచారణకు రావాలని రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ ఖాత‌రు చేయ‌క‌పోవ‌డంతో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండ‌గా… తాజా కేసుల గురించిన చ‌ర్చే ఇది. నేరాల‌కు పాల్ప‌డిన తెలుగుదేశం నేత‌ల మొత్తం చిట్టా తీస్తే చాంతాడంత ఉంటుంది.