iDreamPost
android-app
ios-app

ఆ జిల్లాల్లో TDP నేత ఓవర్ కాన్ఫిడెన్స్? ఈ సారి కూడా కష్టమే..!

ఆ జిల్లాల్లో TDP నేత ఓవర్ కాన్ఫిడెన్స్? ఈ సారి కూడా కష్టమే..!

ఎన్నికల షెడ్యూల్  తెలంగాణలో విడుదలైంది. కానీ ఎన్నికల్ ఫివర్ ఏపీలో కనిపిస్తుంది. కారణంగా ఏపీ రాజకీయాలు ఎలక్షన్ షెడ్యూల్ రాకున్న ఆ రేంజ్ లోనే హీట్ ఉంటుంది. ముఖ్యంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణులు తీవ్ర  నిరాశాలో ఉన్నాయి. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ చేసిన పొత్తుల ప్రకటన టీడీపీ నేతలకు బూస్ట్  ఇచ్చినట్లు అయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయని పవన్ ప్రకటించారు. అయితే  ప్రకటనతో కొందరు టీడీపీ నేతల్లో గుబులు మొదలైతే.. మరికొందరి నేతలకు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా  ఉభయగోదావరి జిల్లాలో కొందరు టీడీపీ నేతలు ఓవరా కాన్ఫిడెన్స్ గా ఉన్నారని పొలిటికల్ టాక్ వినిపిస్తోంది.

పొత్తు ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన టీడీపీ నేతల్లో మంచి ఊపు తెచ్చింది. రెండు కలసిన వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపుపై ఎటువంటి ప్రభావం ఉండదనేది రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయం. అయితే  చంద్రబాబు అరెస్ట్ తో ఢీలా పడిపోయిన ఆ పార్టీకీ మాత్రం పవన్ ప్రకటనతో బూస్టప్ వచ్చినట్లు అయింది. ఇదే సందర్భంలో ఉభయ గోదావరి జిల్లాలోని కొందరు టీడీపీ నేతల్లో గుబులు పెరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన ఎక్కువ సీట్లు అడిగితే..  చంద్రబాబు కూడా కాదనలేక ఇచ్చేస్తే తమ పరిస్థితి ఏంటనేది  ఆ తమ్ముళ్ల ఆవేదన. ఇలా టీడీపీలో కొందరు ఆవేదన పడుతుంటే.. మరో కేటగిరి నేతలు కూడా ఉన్నారు. జనసేనతో  పొత్తు కుదిరిందనే క్లారిటీ రాగానే  అప్పటి వరకు వాళ్లలో ఉన్న టెన్షన్ పటాపంచలై ఫుల్ ఫ్రీ అయ్యారంట.

జనసేన పొత్తుతో పెద్దగా కష్టపడాల్సిన పనిలేదని, జనాల్లోకి వెళ్లకున్న ఏమి కాదని ఆ నేతలు భావిస్తున్నారంట. ఎన్నికల ముందు అలా ఒకసారి ఓ సారి ప్రచారంకి వెళ్లొచ్చిన ఈజీగా గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఆ నేతలు ఉన్నారంట. ఇంకా చెప్పాలంటే.. నామినేషన్ వేసి తడిగుడ్డ వేసుకుని కుర్చోవచ్చంటూ  విశ్రాంతి మూడ్ లోకి వెళ్లారంట. జనసేనతో పొత్తు కుదిరిన చంద్రబాబుతో తమకు  ఉన్న అనుబంధం, తమకు ఉన్న సీనియారిటీతో  టికెట్ ఈజీగా వస్తుందని  ఆ నేతలు భావిస్తున్నారని టాక్. చివకు పార్టీ కార్యక్రమాలతో కూడా సంబంధం లేనట్లుగా హాయిగా కాలక్షేపం చేస్తున్నరని పొలిటికల్ టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరిలో సీఎం జగన్ పర్యటిస్తే.. అసలు పట్టించుకోలేదంట సదరు నాయకులు. సీఎం వ్యాఖ్యలకు కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేదంట.

అయితే వీళ్ల మీద టీడీపీ కొందరు నేతలు మండిపడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు అరెస్టు, బెయిల్ వంటి వాటిలో ముఖ్యనేతలు బిజీగా ఉన్నారు. కొన్నాళ్లు ఆగండి.. తరువాత ఆ నేతల గురించి చూద్దామని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆ కొందరి నేతలు ఓవర్ కాన్ఫిడెన్స్ తో మిగిలిన వాళ్లు కోపంగా ఉన్నరంట. ఇప్పటికే జగన్ హావాలో ఎలా గెలవాలని అందరు భయపడుతుంటే.. ఈ నేతలు మాత్రం.. ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండటం ఏంటని కొందరు తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నట్లు పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి. మరి.. సోషల్ మీడియాలో వినిపిస్తోన్న  ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి