iDreamPost
android-app
ios-app

ఆశ్చర్యంగా లేదు జవహర్‌..!

ఆశ్చర్యంగా లేదు జవహర్‌..!

రాజకీయనేతలు చేసే విమర్శలు చిత్రంగా ఉంటాయి. నిజానిజాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థి పార్టీ, ప్రభుత్వంపై అలవోకగా విమర్శలు, ఆరోపణలు చేయడం రాజకీయాల్లోనే సాధ్యం. పూర్వ అనుభవం లేకపోయినా.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అవి బాగా వంటబడతాయనేందుకు మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ ప్రత్యక్ష నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వ ద్వితియార్థంలో కేఎస్‌ జవహర్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా పని చేశారు. బీరు హెల్త్‌ డ్రింక్‌ అంటూ ప్రమోట్‌ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పేరు సంపాదించారు. ఇప్పుడు ఆ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు.

ఈ క్రమంలో జవహర్‌ వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన ప్రభుత్వ పాఠశాలలు, విద్యా విదానంపై విమర్శలు గుప్పించారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులను బలితీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు జాతీయ విద్యా విధానం పేరుతో విద్యార్థులను విద్యకు దూరం చేస్తోందని జవహర్‌ విమర్శించారు. సంస్కరణల పేరుతో విద్యా వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం బ్రష్టుపట్టిస్తోందని కూడా అన్నారు.

2014లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయకముందు.. జవహర్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేశారు. ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన జవహర్‌ ఎమ్మెల్యే కావడంతోపాటు.. మంత్రి పదవి వరించింది. రాజకీయాల్లోకి రాక ముందు ఉపాధ్యాయుడైన రావెల కిషోర్‌కు.. 2014కు ముందు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2019 వరకు.. వైసీపీ ప్రభుత్వ పాలన ప్రారంభమైన తర్వాత.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో తెలియంది కాదు.

Also Read : అయ్యో.. ఉమా గారు ..!

టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏ విధంగా నాశనమైందో జవహరే సాక్షి. 30 మంది కన్నా విద్యార్థులు తక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలలను మూసివేసి చిన్నారులను విద్యకు దూరం చేశారు. చివరకు పట్టణాలు, నగరాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను కూడా విలీనం పేరిట వాటి సంఖ్యను తగ్గించారు. విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలు సగం ఏడాది పూర్తయిన తర్వాతే అందేవంటే టీడీపీ హాయంలో ప్రభుత్వ విద్య ఎలాంటి దుస్థితిని ఎదుర్కుందో ఇట్టే అర్థమవుతుంది.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. నాడు నేడు పేరుతో.. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్‌ పాఠశాలల కన్నా మిన్నగా తయారు చేస్తున్నారు. మౌలిక సౌకర్యాలే కాదు.. విద్యా విధానంలోనూ సమూల మార్పులు తెచ్చారు. ధనవంతుల పిల్లలకు మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేసేందుకు నిర్ణయించారు. అమ్మ ఒడి పేరుతో విద్యార్థుల తల్లులకు 15 వేల రూపాయల చొప్పన అందిస్తున్నారు. ప్రభుత్వ బడికి వచ్చే విద్యార్థులు కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉండేందుకు.. వారికి జగనన్న విద్యా కానుక పేరిట స్కూల్‌ బ్యాగు, మూడు జతల యూనిఫాం, సాక్స్, షూ, బెల్ట్‌ నోట్‌పుస్తకాలు ఉచితంగా అందిస్తున్నారు.

వారంలో పాఠశాల నిర్వహించే ఆరు రోజులు భిన్నమైన మెనుతో.. మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నారు. ఇవన్నీ.. జవహర్‌కు కనిపించడం లేదా..? అనేదే సందేహం. మంత్రి హోదాలో రాజహేంద్రవరం సెంట్రల్‌జైలు ఎదురుగా ఉన్న ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకర్ల సమావేశం పెట్టి.. సెంట్రల్‌ జైలులో గంజాయి సాగు చేస్తున్నారంటూ.. ఏకంగా జైలు ఉన్నతాధికారులపై విచిత్రమైన ఆరోపణలు చేసిన జవహర్‌.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ.. ప్రభుత్వంపై ఇలాంటి హాస్యాస్పదమైన విమర్శలు చేయడంలో ఆశ్చర్యలేదు.

Also Read : ఇసుక ర్యాంపు కోసం కొట్లాట.. మరచిపోయారా బుచ్చయ్య ..?