Idream media
Idream media
రాజకీయాల్లో రాణించాలంటే పొగడ్తకు మించిన ఆయుధం లేదు. అధినేతలను ప్రసన్నం చేసుకునేందుకు వారిపై నేతలు పొగడ్తల వర్షం కురిపింస్తుంటారు. దేవుడు అంటూ కీర్తిస్తుంటారు. కొంత మంది ఈ పొగడ్తల వర్షం హద్దును దాటకుండా సాగిస్తుంటారు. మరికొంత మంది చేసే భజనలు హద్దులు దాటుతుంటాయి. ఫలితంగా పొగిడిన వారు, పొగిడించుకున్న వారు ఇద్దరూ నవ్వులపాలుకావాల్సి వస్తుంది.
మంత్రిగా ఉన్నప్పుటి నుంచి బరువు తగ్గాలని ప్రత్నిస్తున్న నారా చంద్రబాబు నాయుడు కుమరుడు నారా లోకేష్ అప్పుడు సాధించలేకపోయినా.. ప్రతిపక్షంలోకి వచ్చిన రెండేళ్లకు బరువు తగ్గారు. సన్నబడ్డారు. మంత్రి కొడాలి నానికి కౌంటర్ ఇచ్చే సమయంలో.. టీడీపీ మహిళా నేత దివ్యవాణి.. నారా లోకేష్‌ను సీనియర్ ఎన్టీఆర్‌తో పోల్చారు. సరికొత్త లోకేష్‌ను చూసిన ఏపీ ప్రజలు.. స్వర్గీయ ఎన్టీఆర్‌లా ఉన్నాడంటున్నారంటూ తాతతో పోల్చి వార్తల్లో నిలిచారు. నారా లోకేష్ మాట తీరు, శరరీ తీరు చూశాక కొడాలి నానికి మతిపోయినట్లుందంటూ కూడా వ్యాఖ్యానించారు.
తెలుగు సినీ రంగంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ది ప్రత్యేక స్థానం. వందలాది చిత్రాల్లో.. భిన్నమైన పాత్రలు వేసి ఆంధ్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. దేవుడు పాత్రలు ధరించి.. ఆయా దేవుళ్లు ఇలానే ఉంటారేమోననేలా మెప్పించారు. రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చినా.. ఎన్టీఆర్‌ను ప్రజలు పార్టీలకు అతీతంగా అభిమానించారు. ఇప్పటికీ అభిమానిస్తున్నారు. ఎన్టీఆర్‌ను తలుచుకుంటే.. ఆయన మోము ప్రజల కళ్లలో మెదులుతుంది. ఎన్టీఆర్ పోలికలతో ఉన్న ఆయన మనవడు, హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌లో ప్రజలు సీనియర్ ఎన్టీఆర్‌ను చూసుకుంటున్నారు. తాత పోలికలతో పుట్టిన జూనియర్‌ను ఆయన రాజకీయ వారసుడని టీడీపీ శ్రేణులు కూడా నమ్ముతున్నారు. అలాంటిది.. ఏ పోలీకలు లేని నారా లోకేష్‌ను సీనియర్ ఎన్టీఆర్‌తో దివ్యవాణి ఎలా పోల్చారన్నదే అంతుచిక్కని ప్రశ్న.
నారా లోకేష్ బరువు తగ్గడడం టీడీపీ నేతలను ఆశ్చర్యంలో ముంచెత్తినట్లుంది. లోకేష్ సన్నబడడం ఆ పార్టీ నేతలు కూడా నమ్మలేకుండా ఉన్నట్లుగా ఉన్నాయి దివ్యవాణి వ్యాఖ్యలు. లోకేష్ మాట తీరు, శరీర తీరు చూశాక.. మంత్రి కొడాలి నానికి మతిపోయినట్లుందని అన్నారు దివ్యవాణి. బరువు తగ్గడం, సన్నబడడం సాధారణ విషయమే అయినా.. లోకేష్ బరువు తగ్గడం, సన్నబడడం వారికి పెద్ద అచీవ్‌మెంట్‌లా భావిస్తున్నట్లున్నారు. లేకపోతే లోకేష్ శరీర తీరు చూస్తే మంత్రికి మతి ఎందుకు పోతుందో.. దివ్యవాణే చెప్పాలి.
Also Read : పారిపోయిన విషయం లోకేష్‌కు గుర్తులేదా..?