iDreamPost
android-app
ios-app

Nellore ,tdp leader- మొన్న ఆత్మహత్యాయత్నం.. నిన్న అరగుండు, అర మీసం.. చర్చనీయాంశంగా మారిన టీడీపీ నేత!

Nellore ,tdp leader- మొన్న ఆత్మహత్యాయత్నం.. నిన్న అరగుండు, అర మీసం.. చర్చనీయాంశంగా మారిన టీడీపీ నేత!

నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగగా ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో సహా దాదాపు అన్ని చోట్లా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నెల్లూరులో అయితే మొత్తంగా 54 డివిజన్లకు 54 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ కనీసం ఒక్కటి  కూడా గెలవలేని పరిస్థితి. సంక్షేమ పథకాలు తమను గెలిపించాయని వైసీపీ చెబుతుంటే అక్రమాలతో ఈ ఎన్నికల్లో గెలిచిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు 49, 50వ డివిజన్లలో టీడీపీని ఓడించేందుకు వైసీపీ ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని టీడీపీ నేత కప్పెర శ్రీనివాసులు సంచలన ఆరోపణలు చేశారు.

అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టీడీపీ నేత కప్పెర శ్రీనివాసులు అర గుండు గీయించుకుని, అర మీసం తీయించుకున్నారు. ఈ వింత వేషం సహా పాటు మెడలో పలక తగిలించుకున్నారు. జగన్ పోవాలి, బాబు రావాలి అంటూ దాని మీద రాశారు. మంత్రి అనిల్ సహా ఆయన అనుచరులు ఇతర నాయకులు టీడీపీ ఓటమి కోసం కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి ముఖ్యమంత్రి అయ్యే వరకు అలాగే ఈ అరా గుండు, అర మీసం దీక్షలో ఉంటానని ప్రకటించారు. మళ్లీ జనరల్ ఎన్నికలు జరిగే వరకూ ఇలాగే ఉంటానని శపథం చేశారు. నిజానికి ఇలాంటి ఛాలెంజులు రాజకీయ నాయకులు చాలా మంది చేస్తూ ఉంటారు కానీ శ్రీనివాసులు అరగుండు దీక్ష ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీనివాస్ అరగుండు, అరమీసం గీయించుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఇచ్చిన మాట మీద ఉన్న చిత్తశుద్ధి బాగుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

నెల్లూరు పార్లమెంట్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడయిన కప్పెర శ్రీనివాసులు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 49, 50 డివిజన్ల టీడీపీ క్లస్టర్‌ ఇన్‌ఛార్జిగా పని చేశారు. గతంలో నెల్లూరులో కార్పొరేటర్ గా పని చేశారు ఆయన. అయితే సరిగ్గా ఐదు రోజుల క్రితం పోలీసులు వేధిస్తున్నారు అంటూ సదరు శ్రీనివాసులు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. ఆదివారం నాడు సంతపేట పోలీసు స్టేషన్‌ లో ఒక్కసారిగా నిద్రమాత్రలు మింగేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఆయనను హుటాహుటిన రామచంద్రారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొంది బయటకు వచ్చిన వెంటనే ఈ దీక్షకు దిగారు. 

Also Read : Chinta Mohan..కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న కేంద్ర మాజీ మంత్రి.. ఆశించిన పదవి దక్కుతుందా..?