Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వ విధానాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఎదురవుతున్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్. ప్రతీ పథకంపైనా నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ అమలవుతున్న తీరును తెలుసుకుంటున్నారు. లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ పురోగతి సాధిస్తున్నారు. సౌకర్యవంతమైన కొత్త తరహా పాలనను ప్రజలకు అందిస్తున్నారు. వీటి ఫలితంగానే ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాయి. ఎన్నిక ఏదైనా విజయం ఆ పార్టీ అభ్యర్థులదే. శక్తియుక్తులను, ఆర్థిక బలాలను ఉపయోగించి ఎంతలా పోరాడినా జనం ఇతర పార్టీల వైపు చూడడం లేదు. దీంతో ఓటమికి భయపడి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పరిషత్ ఎన్నికల్లో ఆడిన కొత్త డ్రామాలు కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేయక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో గెలుపు కోసం టీడీపీ విరుద్ధ దారుల్లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో మినీ ఎన్నికల యుద్ధం నడుస్తుందని చెప్పొచ్చు. టీడీపీ పోరాట తీరును చూస్తే అలాగే ఉంది. వివిధ కారణాలతో వాయిదా పడుతూ కార్పొరేషన్ సహా పన్నెండు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 533 వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికలను ఎదుర్కొంటోన్న మున్సిపాలిటీల్లో- తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం కూడా ఉంది. అన్ని చోట్లా టీడీపీ పోటాపోటీగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గెలుపు కోసం అడ్డదారుల్లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వంపై ఉన్న ఆదరణ దృష్ట్యా విమర్శలు ప్రజలను ఆకట్టుకోవడం లేదు. దీంతో స్థానిక పరిస్థితులను, దుష్ప్రచారాలను తెరపైకి తెస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రచార అంశాలను పరిశీలిస్తే.. కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇస్లాంపేట, భగత్ సింగ్ కాలనీ, తదితర ప్రాంతాల్లో ఇళ్లు కూల్చివేతలకు అధికార పార్టీ ప్రణాళికలు రచిస్తోందంటూ టీడీపీ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్పొరేషన్ లో మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. దాదాపు అన్ని చోట్లా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతోందన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. స్థానికంగా ప్రజల అభిప్రాయాలు కూడా అలాగే వినిపిస్తున్నాయి. దీంతో కుట్రలు, కుతంత్రాలతో దుష్ప్రచారాలు మొదలయ్యాయి. అలాగే కుప్పం మున్సిపాల్టీలో ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తున్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. , కాగా, నామినేషన్ల సమయంలో తెలుగుదేశం పార్టీకి కనీసం పోటీ చేసే అభ్యర్థులు కూడా దొరక్క పోవడం ఆ పార్టీ దౌర్భాగ్యానికి దుస్థితికి అద్దం పడుతోందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజల మద్దతు తమకే ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Kamalapuram Municipality, TDP Candidates, Financial Support – టీడీపీ అభ్యర్థులకు కాసుల కష్టాలు