iDreamPost
android-app
ios-app

జ‌గ‌న్ చేసిన మంచి ప‌ని అదొక్కటేన‌ట‌..!

జ‌గ‌న్ చేసిన మంచి ప‌ని అదొక్కటేన‌ట‌..!

మంచి చేసినా మ‌న‌స్ఫూర్తిగా మెచ్చుకునేందుకు ఏపీ ప్ర‌తిప‌క్షానికి మ‌న‌సురావ‌డం లేదు. తాము అధికారంలో ఉండ‌గా చేయలేని ప‌నిని వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేశార‌న్న కృత‌జ్ఞ‌త క‌నిపించ‌డం లేదు. జ‌గ‌న్ స‌ర్కారు ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేయ‌డంపై టీడీపీ నేత‌లు స్పందిస్తున్న తీరే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవ‌చ్చు. జిల్లా ప్ర‌క‌ట‌న వెలువ‌డ్డాక కూడా చంద్ర‌బాబు వెంట‌నే స్పందించ‌లేదు. ఒక‌టి, రెండు రోజుల త‌ర్వాత నోరు విప్పినా ఎన్టీఆర్ కు గుర్తింపు ద‌క్క‌డం ప‌ట్ల అంత‌గా అభిమానంతో ఉప్పొంగ‌లేదు. విచిత్రంగా స్పందించారు. ఇప్పుడు ఆయ‌న బాట‌లోనే మిగిలిన టీడీపీ నేత‌లు కూడా న‌డుస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

సాధారణంగా రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానాలు నీటి మూటలవుతుంటాయి. అందుకే ప్రజలు అలాంటి నాయకులిచ్చే హామీలు అమలవుతాయని పెద్దగా ఆశలు పెట్టుకోరు. కానీ మాట తప్పని, మడమ తిప్పని నైజం.. మాటిచ్చారంటే ఎన్ని కష్టాలు, అవరోధాలు ఎదురైనా వెన్నుచూపని విలక్షణంతో.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అత్యంత అరుదైన నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇప్పటికే జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. చెప్పాడంటే.. చేస్తాడంతే! అనే పేరును తెచ్చుకున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లాగా పేరును ఖరారు చేసి ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న‌కున్న గుర్తింపును చాటుకున్నారు.

ఏపీలో జిల్లాల విభజనపై ప్రతిపక్ష నేతలు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేయడంపై ఇప్పటికే పురంధేశ్వరి స్వాగతించారు. చంద్రబాబు ఎన్టీఆర్ పేరు పెడ‌తామంటే వ‌ద్దంటామా అని విచిత్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా స్పందించారు. 2019 నుంచి జగన్ పాలనలో 100 పనులు చేస్తే అందులో 99 సుద్ద తప్పులు ఉన్నాయని… ఆ తప్పులతో జగన్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ప్రతి తప్పుకి ప్రజలను డైవర్ట్ చేయడం ఈ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఇప్పటివరకు పెరిగిన ధరలకు సమాధానం లేదని.. రాష్ట్ర అప్పుల గురించి సమాధానం లేదని… ప్రత్యేక హోదాపై సమాధానం లేదని… ఉద్యోగుల సమస్యపై సమాధానం లేదని ఆరోపించారు.