iDreamPost
android-app
ios-app

కొన్ని జిల్లాల్లో టీడీపీ జెండా మాయం?

కొన్ని జిల్లాల్లో టీడీపీ జెండా మాయం?

మ‌హ‌నీయుడు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఓ వెలుగు వెలిగింది. ఆయ‌న హ‌యాంలో ప్రాంతీయ పార్టీగా తిరుగులేని స‌త్తా చాటింది. ఆ త‌ర్వాత చంద్ర‌బాబునాయుడు హ‌యాంలో కూడా కొన్నేళ్లు బాగానే పుంజుకుంది. జ‌గ‌న్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచీ టీడీపీ ప్రాభ‌వం త‌గ్గుతూ వ‌స్తోంది. 2014లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. వైసీపీకి, టీడీపీ మ‌ధ్య ఓట్ల శాతంలో తేడా 3 మాత్ర‌మే. 2019లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక ఇక స్పీడు త‌గ్గుతూ వ‌చ్చింది. ఈ రెండేళ్ల కాలంలో జ‌గ‌న్ దెబ్బ‌కు ప్ర‌తీ జిల్లాలోనూ ఉనికి కోల్పోతోంది. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీ క్లోజ్ అయిపోయింది. ఇఏపీలో జగన్ దెబ్బకు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.

గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఏపీలో టీడీపీ నానా కష్టాలు పడుతుంది. ఇక పార్టీని బలోపేతం చేయడానికి బాబు తీవ్ర కష్టాలు పడుతున్నారు. అయితే ఎంత కష్టపడిన జగన్ను ఎదుర్కొనే సత్తా టీడీపీకి లేకుండా పోయింది. అసలు జగన్ దెబ్బకు ఏపీలో పలు జిల్లాల్లో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. కొద్దో గొప్పో కోస్తా జిల్లాల్లో టీడీపీకి బలం కనిపిస్తుందిగానీ రాయలసీమ జిల్లాల్లో మాత్రం టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది. తెలంగాణలో టీడీపీ ఎలా కనుమరుగైపోయిందో అలాగే సీమలో కూడా టీడీపీ కనుమరుగయ్యే స్థితికి వచ్చేసింది. ముఖ్యంగా కర్నూలు కడప జిల్లాల్లో టీడీపీకి భవిష్యత్ కనిపించడం లేదు.

మామూలుగానే ఈ జిల్లాల్లో టీడీపీకి పెద్ద బలం లేదు. వైసీపీ వచ్చాక ఈ రెండు జిల్లాల్లో టీడీపీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే ఈ రెండు జిల్లాల్లో వైసీపీ వేవ్ నడిచింది. కర్నూలులో 14 సీట్లలో వైసీపీ 11 గెలుచుకుంది టీడీపీకి 3 సీట్లు వచ్చాయి. అటు రెండు ఎంపీ సీట్లు వైసీపీ గెలుచుకుంది. అటు కడపలో 10 సీట్లలో వైసీపీ 9 టీడీపీ ఒకటి గెలుచుకుంది. రెండు ఎంపీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇక 2019 ఎన్నికల్లో రెండు జిల్లాల్లో వైసీపీ క్లీన్స్వీప్ చేసింది. టీడీపీకి గుండు సున్నానే మిగిలింది. అయితే ఎన్నికలై రెండేళ్ళు అయిపోయింది. అయినా సరే ఈ రెండు జిల్లాల్లో టీడీపీ పుంజుకోలేదు. పైగా వైసీపీ అధికారంలో ఉండటంతో టీడీపీకి ఛాన్స్ ఉండటం లేదు. రాను రాను రెండు జిల్లాల్లో టీడీపీ ఉనికి కోల్పోతుంది. భవిష్యత్లో కూడా ఈ రెండుచోట్ల టీడీపీ జెండా ఎగరడం కష్టమే అని తెలుస్తోంది.