Idream media
Idream media
రాజకీయాలు ప్రజాసేవ కోసం అంటారు. ప్రజలకు సేవ చేసేందుకు అధికారం కావాలి. ప్రజల అభిమానం గెలుచుకుంటే అధికారం దక్కుతుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, నేతలు.. ప్రజల అభిమానం గెలుచుకునేందుకు వారి సమస్యల పట్ల పోరాటాలు చేస్తుంటారు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉంటే పోరాటాలు చేస్తారు. ఇది సర్వసాధారణంగా ఎక్కడైనా జరిగేది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ప్రజా అభిమానం గెలుచుకోవాల్సిన టీడీపీ.. ఆ దిశగా పని చేయకుండా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అసత్య ఆరోపణలు, దుష్ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందాలనుకుంటోంది.
జగన్ పరపతిని తగ్గించాలని శతఃవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ.. తాను చేస్తున్న పనులతో ప్రజలముందు దోషిగా నిలబడుతోంది. తాజాగా గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తన ఫేస్బుక్ పేజీ ద్వారా జగన్‌పై చేసిన ఆరోపణ చూస్తే హాస్యాస్పదంగా ఉంది. సిమెంట్, స్టీల్ విక్రయించే సమయంలో వాటి ధరతోపాటు వ్యాపారుల జగన్ ట్యాక్స్ అంటూ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఊరు, పేరులేని ఓ పేపర్‌ను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ‘‘ వ్యాపారులు, వినియోగదారులపై జగన్ ట్యాక్స్ భారం. జగన్ ట్యాక్స్ పేరుతో వైసీపీ నాయకుల బలవంతపు వసూళ్లు. ప్రతి దుకాణంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ వస్తువు కొన్నా ప్రజల నుంచి జగన్ ట్యాక్స్ వసూలు.. అసలే ఆకాశాన్నంటిన ధరలకు తోడు ఈ జగన్ ట్యాక్స్‌తో ప్రజలు బెంబేలు..’’ ఆ పోస్టుకు తన పైత్యాన్ని జోడించారు యరపతినేని శ్రీనివాసరావు.
యరపతినేని పోస్టులో నిజమే ఉందనుకుందామనుకున్నా.. ఆ అవకాశం ఆయనే ఇవ్వలేదు. భవ్య సిమెంట్ అంటూ లోగో ఉన్న పేపర్‌పై స్టీల్, సిమెంట్ విక్రేత పేరు, అడ్రస్‌తోపాటు, కొనుగోలుదారుడి పేరు కూడా లేదు. రోడ్డు మీద దొరికిన పేపర్‌పై తమకు నచ్చినది రాసి జన బాహుల్యంలోకి వదిలితే.. నిజమేనని నమ్మేస్తారని యరపతినేని ఆశ కాబోలు. తల ఉన్న వారు ఎవరైనా.. నిజంగా అలాంటి దందా చేస్తుంటే జగన్ ట్యాక్స్ అంటూ పేపర్‌పై రాయడు. బహుశా.. గతంలో తమ పార్టీ నేతలు చేసిన దందాను దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్ జగన్‌పై కూడా అదే తీరున యరపతినేని శ్రీనివాసరావు ప్రచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లున్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడులో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం.. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కే ట్యాక్స్ పేరుతో పెద్ద వ్యాపారుల నుంచి రోడ్డు పక్కన బండిపై అరటిపళ్లు అమ్ముకుని జీవనం సాగించే వారి వరకూ వసూళ్లదందాకు పాల్పడింది. కోడెల ట్యాక్స్ (కే ట్యాక్స్) అంటూ దానికి పేరు పెట్టారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికారం పోయిన తర్వాత కోడెల కుమారుడు, కుమార్తె చేసిన దందాలు, అక్రమాలు వెలుగులోకి రావడంతో కేసులు నమోదయ్యాయి. అసెంబ్లీలోని ఫర్నీచర్ కూడా తమ సొంత ఆస్తి మాదిరిగా తమ ఇంటికి తరలించుకుపోయారు. ఇవన్నీ వెలుగులోకి రావడం, మరో వైపు పార్టీ, చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నాడు తమ పార్టీ హయాంలో జరిగిన దందా.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందనే భ్రమ ఉన్న యరపతినేని తలాతోక లేని పోస్టును తన ఫేస్బుక్ పేజీలో పెట్టడడం చిల్లర రాజకీయానికి పరాకాష్టగా చెప్పవచ్చు.
Also Read : బాబు భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారా?