Idream media
Idream media
ఎన్నికల్లో ఓటమి తర్వాత రెండేళ్లుగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ.. వాటిని ఉచ్ఛస్థితికి తీసుకెళుతోంది. వర్తమాన వ్యవహారాలను తమకు అనుకూలంగా, రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా ఉపయోగించుకుంటోంది. తాజాగా వైఎస్ జగన్ బెయిల్ రద్దు అవుతుందని, టీడీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని, ఓ వర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఓ పోస్ట్‌ను వాట్స్‌అప్, ఫేస్‌బుక్ మాధ్యమాలలో విస్తృత ప్రచారం చేస్తోంది. ఈ విషయం వైసీపీ నేతల దృష్టికి రావడంతో.. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. దుష్ప్రచారాన్ని ఆపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ పోస్టులో ఏ ముందంటే..
సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం జూలై 14వ తేదీన బెయిర్ రద్దు తప్పదు. బెయిల్ రద్దు తీర్పు వచ్చిన రోజున తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కర్యాకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలి. అనంతపురం, కడప, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని ఓ వర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీసులును కూడా నమ్మొద్దు. 1988 డిసెంబర్, 1991 మే నెలల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటన మాదిరిగా ఇప్పుడు కూడా నీలి గుండాలను ఎదుర్కొక తప్పదు. పోరాటం అంతిమ దశకు చేరుకుంటుంది.. అంటూ భయందోళనలు రేకెత్తించేలా. కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టేలా.. అభూత కల్పనలతో ఆ పోస్టును రాశారు.
చర్యలు తీసుకోండి..
సదరు పోస్టు తన దృష్టికి వచ్చిన వెంటనే లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేసేందుకు ఉప్రమించారు. ఈ నెల 11వ తేదీ నుంచి సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతున్న సదరు పోస్టును పేర్కొంటూ… బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా, ఓ వర్గం వారిని రెచ్చగొట్టేలా, న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశంపై మాట్లాడడం సబ్ జుడిస్ అనే విషయం తెలిసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం చేస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అపహాస్యం చేసేలా, హాస్యభావంతో, అసత్యపూరిత కథనాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సోషల్ మీడియాలో సర్కిలేట్ అవుతున్న సదరు పోస్టును తొలగించాలని లేళ్ల అప్పిరెడ్డి తన ఫిర్యాదులో కోరారు.
Also Read : జగన్ బెయిల్ కేసు విచారణ ముగుస్తోందా?రఘురామకు నిరాశేనా?