iDreamPost
android-app
ios-app

అప్పుడు చంద్రబాబును ఆసుపత్రిలో చూపించారా అయ్యన్నా?

  • Published Jan 23, 2022 | 3:05 AM Updated Updated Mar 11, 2022 | 10:22 PM
అప్పుడు చంద్రబాబును  ఆసుపత్రిలో చూపించారా అయ్యన్నా?

జిల్లాకో ఎయిర్ పోర్ట్ కట్టాలంటూ సీఎం జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయం తుగ్లక్ చర్య అని, సీఎంను ఆసుపత్రిలో చూపించాలి అంటూ మాజీమంత్రి
అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ నాయకులు తప్పుపడుతున్నారు. అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానని జనానికి
గ్రాఫిక్స్ చూపినప్పుడు, అమరావతిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించమని అధికారులను ఆదేశించానని ప్రకటించినప్పుడు, రైతులకు పూర్తిగా రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చినప్పుడు చంద్రబాబును ఆ విధంగా ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చూపించారా అని ప్రశ్నిస్తున్నారు.

శనివారం విశాఖ జిల్లా నర్సీపట్నంలో అయ్యన్న విలేకరులతో మాట్లాడుతూ ‘అమ్మా.. భారతమ్మా.. ఈ తుగ్లక్ నిర్ణయాలన్నీ చూస్తుంటే మీకు ఎలా ఉందో తెలియదు గాని, మాకైతే మీ ఆయనకి ఏదో అయిందనే అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి హైదరాబాద్‌లో గాని, విశాఖప్నటంలో గాని ఆసుపత్రిలో చూపించండమ్మా’ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఒక ఎయిర్‌పోర్ట్ కట్టాలంటూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అయ్యన్నపాత్రుడు పూర్తిగా తప్పు బట్టారు. ముఖ్యమంత్రి మరో తుగ్లక్ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. తుగ్గక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు ఏమయ్యాయని అయ్యన్న ప్రశ్నించారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ట్రైబల్ యూనివర్సిటీ వంటి వాటి నిర్మాణాలను గాలికొదిలేసి జిల్లాకో ఎయిర్‌పోర్టు కడతావా? అంటూ ఎద్దేవా చేశారు. చెత్తమీద కూడా పన్ను వసూలు చేస్తూ.. జిల్లాకో ఎయిర్‌పోర్ట్ కడతామని చెప్పడానికి సిగ్గులేదా? అని అయ్యన్న పాత్రుడు రెచ్చిపోయారు.

బాబువే తుగ్లక్ నిర్ణయాలు..

ఊహల్లో వివరిస్తూ, వాస్తవాలను వక్రీకరిస్తూ చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ తుగ్లక్ చర్యలేనని వైఎస్సార్ సీపీ నాయకులు దుయ్యబడుతున్నారు. ఎన్టీఆర్ కు వెన్ను పోటు పొడిచి అధికారంలోకి వచ్చిన కొత్తలో విజన్ 2020 అంటూ పెద్ద ఎత్తున ప్రచారంతో ఊదరగొట్టారని, తీరా చూస్తే ఇంకుడు గుంతలు ఎవరి
ఇంటి పెరట్లో వారు తవ్వుకోవాలని చెప్పడానికి ప్రజాధనంతో పబ్లిసిటీ చేశారని గుర్తు చేస్తున్నారు. జనాన్ని శ్రమదానం చేయమని కోరడానికి జన్మభూమి అంటూ ప్రచారం చేసి దానినే విజన్ 2020 అని చెప్పుకున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చాక విజన్ 2050 అంటూ కొత్తగా పబ్లిసిటీ స్టంట్ మొదలు పెట్టి రాజధాని పేరిట గ్రాఫిక్స్ చూపారు. 2050 నాటికి ప్రపంచంలో మూడో స్థానానికి అమరావతి రాజధాని చేరుకుంటుందని పచ్చ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో పదేళ్లు ఉండే హక్కు ఉన్నా రాత్రికి రాత్రి అమరావతి వచ్చేశారు. అన్ని ప్రాంతాల మట్టి అమరావతికి రప్పించి, ప్రజాధనంతో అదో ఈవెంట్ లా నిర్వహించారు. ఇవన్నీ తుగ్లక్ చర్యలు కావా అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఆచరణ సాధ్యం కానివి జగన్ చెప్పరు..

సీఎం జగన్మోహనరెడ్డి ఆచరణ సాధ్యం కానివి ఏవీ హామీలుగా ఇవ్వరని, అందుకు 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీ ఇవ్వకపోవడమే
ఉదాహరణ అని వైఎస్సార్ సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తప్పుడు హామీ ఇచ్చి ఉంటే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గెలిచేవారు. 2019 ఎన్నికల్లో ఇచ్ఛిన హామీల్లో 96 శాతం అమలు చేశారు. ఆ విధంగా ఆచరణకు తగిన ప్రణాళిక రూపొందించిన తరువాతనే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రకటిస్తారని, జిల్లాకో ఎయిర్ పోర్ట్ నిర్మించాలి అనేది కూడా అటువంటిదేనని చెబుతున్నారు. గతంలో వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చినప్పుడు, జగన్ నవరత్నాలను ప్రకటించినప్పుడు టీడీపీ ఇలాగే రాద్దాంతం చేసింది. వీరి ఏడుపు గొట్టు వ్యాఖ్యలను పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పినది చేసి చూపుతారని వైఎస్సార్ సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.