iDreamPost
android-app
ios-app

తమీమ్ ఇక్బాల్ ప్రపంచ రికార్డు..

తమీమ్ ఇక్బాల్ ప్రపంచ రికార్డు..

బంగ్లాదేశ్ క్రికెటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ అరుదైన ఘనతను సాధించాడు. ఒక దేశం తరపున మూడు ఫార్మాట్లలో(టెస్టు,వన్డే,టి20)అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచి రికార్డు సృష్టించాడు. ఈ ఘనత క్రికెట్ దిగ్గజాలైన సచిన్,కోహ్లీలకు కూడా సాధ్య పడకపోవడం గమనార్హం.. సచిన్ భారత్ తరపున టెస్టులు వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచినా టి20ల్లో మాత్రం కోహ్లీ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌ మాత్రం తన దేశం తరపున మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు ఎవ్వరికీ సాధ్యపడకపోవడం విశేషం.. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 9 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ప్రపంచ రికార్డును సాధించగా అదే తొమ్మిది పరుగుల వద్ద వెస్టిండీస్ బౌలర్ రోచ్ తమీమ్‌ ఇక్బాల్‌ని బౌల్డ్ చేసాడు..

2007లో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 60 టెస్టుల్లో 9 సెంచరీలతో 4,405 పరుగులు, 210 వన్డేల్లో 13 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలతో 7,360 పరుగులు చేయగా 78 టీ20 అంతర్జాతీయ మ్యాచులాడి ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలతో లో 1,758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ తరపున మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు కూడా తమీమ్ ఇక్బాల్ కావడం గమనార్హం..