iDreamPost
iDreamPost
మనం ఒకేచోట కదలకుండా కూర్చోవడం చాలా కష్టం.అలా బయటకి వెళ్ళాలి అనిపిస్తుంది. మనకే కాదు మన పెంపుడు జంతువులకి కూడా అలాగే ఉంటుందని అప్పుడప్పుడు బయటకి తీసుకెళతాం. మరి ఆక్వేరియంలో ఉండే చేపల సంగతి ఏంటి? అవి ఎప్పుడూ ఆ గాజు సీసాల్లోనే, ఆ రూమ్ లోనే ఉంటాయి. తాజాగా ఓ యువకుడు చేపలకి బయట తిరగాలని ఉండదా? అవి కూడా పెంపుడు జంతువులు లాంటివే అని ఆలోచించి రోజూ చేపల్ని సరదాగా వాకింగ్ కి తీసుకెళ్లడం మొదలుపెట్టాడు.
తైవాన్‌లో ఓ వ్యక్తి చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి తోలుకెళ్లే లాంటి ఓ పరికరాన్ని తయారుచేశాడు. దానికి ఓ రౌండ్ ఆక్వేరియంని బిగించాడు. తన ఇంట్లో ఆక్వేరియంలో ఉండే చేపల్ని ప్రతి రోజూ ఆ ప్రామ్ వెహికల్ కి ఉన్న ఆక్వేరియంలోకి మార్చి వాకింగ్ కి తీసుకెళ్తాడు ఆ యువకుడు. తన బుల్లి చేపలకు తైపీ నగరాన్ని మొత్తం తిప్పి చూపిస్తున్నాడు. చిన్నపిల్లల ప్రామ్‌లాగే చేపలకోసం తయారు చేసిన వాకింగ్ ఆక్వేరియం సహాయంతో తన చేపలను నగర వీధుల్లో తిప్పుతున్నాడు.
ఈ వ్యక్తికి ‘హువాంగ్ జియాజీ అకా జెర్రీ’ అనే ఓ యూట్యూబ్ ఛానెల్ ఉంది. అందులో తాను తయారుచేసిన చేపల ప్రామ్ వీడియోను పోస్ట్ చేశాడు. ఇతని దగ్గర మూడు గోల్డెన్ ఫిష్‌లు ఉన్నాయి. ఆ గోల్డెన్ ఫిష్ లని వాకింగ్ ఆక్వేరియంలోకి మార్చి, సాయంత్రం అందరూ తమ పిల్లలు, పెంపుడు జంతువులను పార్క్‌కి తీసుకెళ్తుంటే ఇతను మాత్రం తన చేపల్ని వాకింగ్ కి తీసుకెళ్తున్నాడు. తైపీలో ఈ వాకింగ్ ఆక్వేరియం చూసిన ప్రజలంతా ముచ్చటపడి ఆ చేపలతో ఫోటో దిగుతున్నారు. ఇక ఇతని గురించి ఫోటోలు, వీడియోల రూపంలో తెలుసుకున్న వారంతా ఆ చేపల్ని, అతని వాకింగ్ ఆక్వేరియంని చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వాకింగ్ ఆక్వేరియం సోషల్ మీడియాలో వైరల్.