Idream media
Idream media
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఇప్పుడు పాకిస్తాన్… టీం ఇండియా ను ఎదుర్కోవడానికి అన్ని అస్త్రాలతో బరిలోకి దిగినట్టుగానే కనపడుతుంది. ఐసీసీ టోర్నమెంట్ ఫోబియాను పోగొట్టుకోవాలి అనే లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు… తొలి మ్యాచ్ లో తన దాయాదితో పోరాడుతుంది. ఈ సమరం కోసం ప్రపంచం మొత్తం చూస్తున్న సమయాన పాక్ జట్టు చెలరేగిపోతుంది బౌలింగ్ లో. భారత ఓపెనర్లను కనీసం 5 పరుగులు కూడా చేయనీయకుండానే వెనక్కు పంపారు పాక్ బౌలర్లు.
పవర్ ప్లే లో పాక్ బౌలర్లను వాళ్ళ కెప్టెన్ బాబర్ ఆజం చాలా తెలివిగా వాడుకున్నాడు. క్రీజ్ లో నిలబడితే చెలరేగిపోయే భారత ఒపెనర్లను చాలా వ్యూహాత్మకంగా వెనక్కు పంపించారు. తొలి ఓవర్ నాలుగో బంతికి ఓపెనర్ రోహిత్ శర్మ అవుట్ కాగా మూడో ఓవర్ మొదటి బంతికి కెఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. పవర్ ప్లే లో టీం ఇండియా నాలుగు ఓవర్లకు రెండు వికెట్ ల నష్టానికి కేవలం 21 పరుగులు మాత్రమే చేసింది. ఇక మూడో ఓవర్ చివరి బంతికి సిక్స్, నాలుగో ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్ యాదవ్ కొట్టినవే బౌండరీలు.
పేసర్ ఆఫ్రిదీ, స్పిన్నర్ ఇమాద్ ఇద్దరూ… వికెట్ టూ వికెట్ బంతులు విసిరారు. దీనితో టీం ఇండియా బ్యాట్స్మెన్ క్రీజ్ లో నిలబడటానికి కూడా ఇబ్బంది పడ్డారు. షాహిన్ ఆఫ్రిదీ బౌలింగ్ పవర్ ప్లే లో హైలెట్ గా నిలిచింది. స్వింగ్ చేస్తూనే వికెట్ లను టార్గెట్ చేయడం హైలెట్ అయింది. ఇన్నింగ్స్ అయిదో ఓవర్ లో దూకుడుగా ఆడే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ హసన్ అలీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం జట్టు స్కోర్ 9 ఓవర్లకు మూడు వికెట్ ల నష్టానికి 52 పరుగులుగా ఉంది. క్రీజ్ లో కెప్టెన్ కోహ్లీ,పంత్ ఉన్నారు.
Also Read : WT20 Ind Vs Pak : టీమిండియా, పాకిస్తాన్ మధ్య సమరం కాసేపట్లోనే.