iDreamPost
iDreamPost
మనం కాఫీ తాగుతూ కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేయాలన్నా, చిన్న చిన్న మీటింగ్స్, పనులు చేసుకోవాలన్న అందరికి గుర్తొచ్చేది ‘కేఫ్ కాఫీ డే’నే. కర్ణాటకలో ఓ సామాన్య కుటుంబంలో పుట్టి కాఫీ పంటని సాగు చేస్తూ కాఫీ డేని స్థాపించి దేశ విదేశాల్లో కాఫీ డే పేరుని మారుమ్రోగేలా చేశారు కాఫీ డే సృష్టికర్త వీజీ సిద్ధార్థ. అయితే అనుకోకుండా ఒక సమయంలో ఆయన 59 ఏళ్ళ వయసులో ఓ నదిలో మృతుదేహంగా కనపడి అందర్నీ బాధలో ముంచేశారు. ఇప్పటికి కూడా అది హత్యో, ఆత్మహత్య ఎవరికీ తెలీదు. ఎంతో కష్టపడి సక్సెస్ అయిన ఆయన అలా మరణించడం అందర్నీ బాధించింది.
బయోపిక్ లని వరుసపెట్టి తీసే బాలీవుడ్ తాజాగా కాఫీ డే సృష్టికర్త వీజీ సిద్ధార్థ బయోపిక్ ని ప్రకటించింది. గతంలో ఆయన జీవితంపై ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు రుక్మిణీ బీఆర్, ప్రొసెంజీత్ దత్తా ‘కాఫీ కింగ్’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కనుంది. ఈ పుస్తకం హక్కులను టీ-సిరీస్, ఆల్‌మైటీ మోషన్ పిక్చర్ సంస్థలు కొనుగోలు చేశాయి.
తాజాగా వీజీ సిద్దార్థ బయోపిక్ ని టీ-సిరీస్ అనౌన్స్ చేసింది. మన జీవితంలో కాఫీని భాగం చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వీజీ సిద్ధార్థ జీవితంలోని అన్ని ముఖ్య విషయాలని సినిమాగా తెరకెక్కించనున్నట్టు టీ- సిరీస్ ఛైర్మన్ భూషణ్ కుమార్ మీడియాతో తెలిపారు. ఇందులో సిద్ధార్థ పాత్రను ఎవరు పోషిస్తారో ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అన్ని వివరాలని తెలియచేస్తామన్నారు.
Showcasing the life account of Coffee Mogul who brewed millions!
T-Series Films ,Prabhleen Sandhu & Almighty Motion Picture in association with Karma Media Entertainment are delighted to have acquired the AV rights to the biography of Entrepreneur par excellence,
— T-Series (@TSeries) June 17, 2022