iDreamPost
android-app
ios-app

కేపీ చౌదరితో సురేఖావాణి కుమార్తె సుప్రీత.. వైరల్ అవుతున్న ఫొటో!

కేపీ చౌదరితో సురేఖావాణి కుమార్తె సుప్రీత.. వైరల్ అవుతున్న ఫొటో!

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు మరోసారి తెర మీదకు వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. కబాలి సినిమా ప్రొడ్యూసర్ కేపీ చౌదరిని అరెస్టు చేయడం మాత్రమే కాకుండా.. అతనికి పలువురు సెలబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయని, వారికి డ్రగ్స్ సరఫరా చేశాడు అనే అనుమానాలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కేపీ చౌదరి నేరం అంగీకరించినట్లు.. అతనికి 12 మంది వరకు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు.

అతని ఫోన్ స్వాధీనం చేసుకుని అతని కాల్ డేటాను డీకోడ్ చేశారని.. పలువురితో వందల కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. వారిపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేపీ చౌదరి ఫోన్లో పలువురు నటులు, హీరోయిన్లతో దిగిన ఫొటోలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో సురేఖా వాణి, ఆమె కమార్తె సుప్రీతతో కేపీ చౌదరి క్లోజ్ గా ఉన్న ఫోటోలు నెట్టంట చక్కర్లు కొడుతున్నాయి. సురేఖా వాణి అతనికి ముద్దు పెడుతున్న ఫొటోలు, కేపీ చౌదరి సుప్రీతతో ఉన్న ఫొటోలు ఉన్నాయి. అయితే వీరికి కేపీ చౌదరితో ఉన్న రిలేషన్ ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వారికి కేవలం ఇండస్ట్రీ పరంగానేనా? డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

మరోవైపు ఇండస్ట్రీ అన్నాక అందరినీ కలుస్తూ ఉంటారు. పార్టీల్లో కలిసినప్పుడు ఫొటోలు దిగుతుంటారు. సినిమా వ్యవహారాల గురించి ఫోన్లు మాట్లాడుతుంటారు. వాటిని చూపించి డ్రగ్స్ కేసులో సంబంధాలు ఉన్నాయని, కేపీ చౌదరి తప్పు చేశాడు కాబట్టి.. అతనితో పరిచయం ఉన్న వాళ్లంతా తప్పు చేశారు అనేలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి వార్తలపై బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి స్పందించింది. తన పేరుని అనవసరపు వ్యక్తులతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమయం వచ్చినప్పుడు చెప్పాల్సిన వారికే నిజానిజాలు ఏంటే చెప్తానంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ ఫొటోల వ్యవహారంపై సురేఖా వాణి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet