iDreamPost
iDreamPost
ఇంకా మనదగ్గర ఊపందుకోలేదు కానీ తమిళంలో మాత్రం డైరెక్ట్ ఓటిటి రిలీజుల వ్యవహారం ఓ రేంజ్ లో ఉంది. కొత్తగా సోనీ లివ్ రంగంలోకి దిగి పోటీని ఇంకా రసవత్తరంగా మార్చేస్తోంది. త్వరలోనే విడుదల కాబోతున్న సినిమాల్లో సందీప్ కిషన్ వి రెండున్నాయి. ఒకటి నరగాసురన్. తెలుగులో నరకాసురుడు పేరుతో డబ్బింగ్ చేయబోతున్నారు. ఇది మూడేళ్లుగా ల్యాబులో మగ్గుతున్న మూవీ. రెహమాన్ నటించిన 16తో అందరి దృష్టి ఆకర్షించిన కార్తీక్ నరేన్ దీనికి దర్శకుడు కావడంతో ఆసక్తి ఎక్కువగా ఉంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లోనే దీన్ని కూడా రూపొందించారు. ఇందులో అరవింద్ స్వామి, శ్రేయ లాంటి మనకూ తెలుసున్న యాక్టర్లు బాగానే ఉన్నారు.
ఇక రెండోది కసాడ తాపర. సందీప్ తో పాటు రెజీనా కెసెండ్రా, వెంకట్ ప్రభు, హరీష్ కళ్యాణ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. అంథాలజీ మోడల్ లో దీన్ని రూపొందించారు. ఇది కూడా సోనీ లివ్ లోనే స్ట్రీమింగ్ కాబోతోంది. ఇవి కాకుండా ఇంకా వేరేవి కూడా లైన్ లో ఉన్నాయి కానీ మనకు తెలుసుకున్న తారాగణం ఉన్నది వీటిలోని. చింబు దేవన్ దీనికి దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే పెరుగుతున్నాయి. ఈ రెండు డైరెక్ట్ ప్రీమియర్ల డేట్లు ఇంకా తెలియాల్సి ఉంది. సోనీ లివ్ సౌత్ వెర్షన్ ని త్వరగా గ్రాండ్ గా లాంచ్ చేసి అందులోనూ వివరాలను ప్రకటించబోతున్నారు. లాక్ డౌన్ సద్దుమణిగాక ఉండొచ్చు.
మొత్తానికి మీడియం రేంజ్ సినిమాలకు ఓటిటి మించిన బెస్ట్ ఆప్షన్ కనిపించడం లేదు. తెలుగులో మాత్రం ఎందుకో మన నిర్మాతలు ధైర్యం చేయలేకపోతున్నారు. ఇప్పటి దాకా టాలీవుడ్ నుంచి రిలీజైన డైరెక్ట్ ఓటిటి సినిమాలు ఆశించిన విజయం సాధించలేదనే సెంటిమెంటో లేక థియేటర్లలో అయితేనే భారీ కలెక్షన్లు వస్తాయన్న నమ్మకమో తెలియదు కానీ మొత్తానికి మౌనాన్ని వీడటం లేదు. మరోవైపు లీకులు బయటికి రాకుండా మన నిర్మాతలు ఓటిటిలతో చర్చలు జరుపుతున్నారని భారీ డీల్ సెట్ అయితే అప్పుడు ప్రకటన ఇస్తారనే మరో టాక్ కూడా ఉంది. మొత్తానికి జూన్ లో చాలా కీలక పరిణామాలు ఖాయం.