iDreamPost
android-app
ios-app

Sun Pharma, Andhra Pradesh – ఏపీలో పెట్టుబ‌డుల ప్ర‌వాహం.. తాజాగా మ‌రో దిగ్గ‌జ కంపెనీ..!

Sun Pharma, Andhra Pradesh – ఏపీలో పెట్టుబ‌డుల ప్ర‌వాహం.. తాజాగా మ‌రో దిగ్గ‌జ కంపెనీ..!

పెట్టుబ‌డుల ప్ర‌తిపాద‌న‌ల‌తో రావ‌డ‌మే ఆల‌స్యం.. ఏపీ స‌ర్కారు వ‌డివ‌డిగా అనుమ‌తులు మంజూరు చేస్తోంది. స‌కాలంలో ప‌రిశ్ర‌మ‌ల‌కు రాయితీలు అందిస్తోంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మంజూరు చేయ‌ని పాత బ‌కాయిల‌ను కూడా జ‌గ‌న్ స‌ర్కారే ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు రెండువేల రెండువంద‌ల న‌ల‌భై ఎనిమిది కోట్ల రూపాయ‌ల‌ను ప‌రిశ్ర‌మ‌ల‌కు అందించింది. ఒక కంపెనీ జీవిత కాలం పాటు మ‌నుగ‌డ సాధించేందుకు కావాల్సిన స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వ‌మే క‌ల్పిస్తోంది. దీంతో ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు పెద్ద పెద్ద కంపెనీలు క్యూ క‌డుతున్నాయి.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కు పెట్టుబ‌డిదారులు ఆక‌ర్షితుల‌వుతున్నాయి. ఇటీవ‌లే ఆదిత్య బిర్లా వంటి బ‌డా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చాయి. దీంతో యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌డ‌నున్నాయి. ప‌లు సంస్థ‌లు ఉత్ప‌త్తులు ప్రారంభించిక ముందే ప్ర‌ణాళిక‌ల‌ను ముందుంచుతున్నాయి. పారిశ్రామిక వేత్త‌ల‌కు నిర్వ‌హ‌ణ వ్య‌యం త‌క్కువ‌గా ఉండ‌డంతో పాటు, మెరుగైన ఆదాయం పొందేలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

రూ. 600 కోట్ల‌తో బ‌ద్వేలులో సెంచ‌రీ ఫ్లై ఉడ్ కంపెనీ పెట్టేందుకు సిద్ద‌మైన కంపెనీ.. రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను, జ‌గ‌న్ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను చూసి పెట్టుబ‌డుల‌ను రూ. 2, 600 కోట్ల‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అలాగే.. కొప్ప‌ర్తి లో ఏఐఎల్ కంపెనీ ప్రెసిడెంట్ పంక‌జ్ శ‌ర్మ మాట్లాడుతూ.. ఎన్నిక‌ల‌కు ముందు.. రావాలి జ‌గ‌న్.. కావాలి జ‌గ‌న్ అని చెప్పేవారని, ఇప్పుడు జ‌గ‌న్ వ‌చ్చారు.. అభివృద్ధి తెచ్చార‌ని కొనియాడారు.వీరే కాదు.. ప‌లు కంపెనీల అధిప‌తులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. కియా కూడా 4, 900 కోట్ల‌తో త‌మ ప్రాజెక్టును విస్త‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 

దీంతో పాటు దిగ్గజ ఫార్మా కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఆ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సన్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటుతో దాదాపు 36 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. పరోక్షంగా భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు పొందనున్నారు. సన్‌ఫార్మా ఇంటిగ్రేటెడ్‌ ఎండ్‌ టూ ఎండ్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. మంగళవారం రాష్ట్ర క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ షాంఘ్వి కంపెనీ ఏర్పాటు లాంఛనాలపై చర్చలు జరిపారు. అనంతరం ప్లాంట్‌ ఏర్పాటుపై ప్రకటన చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పర్యావరణ హిత విధానాలపై ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఆయన ఆలోచనలు నన్ను ముగ్దుడ్నిచేశాయని దిలీప్‌ షాంఘ్వి అన్నారు. జనరిక్‌ ఫార్మా రంగంలో ప్రపంచంలోనే నాలుగో పెద్ద కంపెనీగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే హెల్త్‌కేర్‌ రంగంలో హైక్వాలిటీ మెడిసిన్‌ తక్కువ ధరలకే తయారు చేసే కంపెనీ ఇది. 100కు పైగా దేశాల్లో సన్‌ఫార్మా మందులను వినియోగిస్తున్నారు.

రాష్ట్రాన్ని ఆర్థికాభివృద్ది వైపు తీసుకెళ్తున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కృషి వ‌ల్లే ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌ముఖ కంపెనీలు ఆస‌క్తి చూపుతున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇది ఇలాగే కొన‌సాగితే.. అన‌తి కాలంలోనే ఏపీ మ‌రింత అభివృద్ధి చెందడంతో పాటు, యువ‌త‌కు భారీ సంఖ్య‌లో ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Also Read :  పులివెందులలో ప్రతిష్టాత్మక కంపెనీ.. శంకుస్థాపన చేసిన సీఎం