iDreamPost
iDreamPost
రామ్ చరణ్ ధృవలో విలన్ గా తన స్టైలిష్ బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ తో మెప్పించిన అరవింద్ స్వామి ఆ తర్వాత తెలుగులో ఎన్ని ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదు. తన దృష్టి కేవలం తమిళ సినిమాల మీదేనని చెప్పి సున్నితంగా అన్నింటిని తిరస్కరించాడు. 2016 తర్వాత మళ్ళీ టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ చేయలేదు. తాజా అప్ డేట్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్యలో అరవింద్ స్వామి నటించబోతున్నట్టు తెలిసింది. కథ ప్రకారం ఎండోమెంట్స్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన ఒక కీలకమైన పాత్రకు ఇతనే బెస్ట్ ఛాయస్ అని అప్రోచ్ అయ్యారట. అధికారికంగా చెప్పలేదు కానీ చర్చలు జరిగాయని తెలిసింది.
డైరీ చాలా బిజీగా ఉన్నప్పటికీ కథ బాగా నచ్చడంతో పాటు రామ్ చరణ్ నుంచి పర్సనల్ కాల్ వెళ్లడంతో నో చెప్పే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సమాచారం. ఆచార్య షూటింగ్ ఇంకా చాలా బ్యాలన్స్ ఉంది. ఈ రోజు నుంచే చిరంజీవి అడుగుపెట్టబోతున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. వచ్చే వేసవికి విడుదల ప్లాన్ చేసుకున్నారు కాబట్టి మార్చి లోగా మొత్తం పూర్తి చేయాలి. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్ లాంటి పనులు చాలా ఉంటాయి. ఇందులో సోనూ సూద్ ఉండటం వల్ల ఆచార్యకు చాలా ప్లస్ అవుతోంది. లాక్ డౌన్ సహాయాల వల్ల అతని ఇమేజ్ పెరగడంతో కొన్ని మార్పులు కూడా చేశారట.
ఒకవేళ అరవింద్ స్వామి కూడా ఓకే అయితే ఆచార్యకు తమిళ మార్కెట్ పరంగా కూడా ప్లస్ అవుతుంది. 1991లో దళపతిలో రజనీకాంత్ తమ్ముడిగా పరిచయమై రోజాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన అరవింద స్వామి ఆ తర్వాత బొంబాయి లాంటి క్లాసిక్స్ తో చాలా పేరు తెచ్చుకున్నాడు. కానీ వెల్లువలా వచ్చి పడిన మార్కెట్ ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాక సెకండ్ ఇన్నింగ్స్ మన జగపతిబాబులా బ్రహ్మాండంగా జరుగుతోంది. చిరంజీవి-రామ్ చరణ్-సోను సూద్-కాజల్ అగర్వాల్- ఇప్పుడు అరవింద్ స్వామి చూస్తుంటే మంచి క్యాస్టింగ్ తోడవుతోంది ఆచార్యకు.