ఇంటర్ రీవాల్యుయేషన్: ముందు 57, తరువాత 92 మార్కులు!!

ఇంటర్ రీవాల్యుయేషన్: ముందు 57, తరువాత 92 మార్కులు!!

  • Updated - 05:05 PM, Sat - 30 July 22
ఇంటర్ రీవాల్యుయేషన్:  ముందు 57, తరువాత 92 మార్కులు!!

పరీక్షలు రాసినప్పుడు మనం బాగా మార్కులొస్తాయినుకుంటాం. తీరా ఫలితాలు వచ్చాక అంతా తారుమారైందని బాధపడతాం. తాజాగా తెలంగాణ ఇంటర పరీక్షా ఫలితాల్లోనూ అదే జరిగింది. ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల్లో కొంతమంది నిర్లక్ష్యం విద్యార్థులకు మానసికంగా దెబ్బతీసింది.

నల్గొండ జిల్లాకు చెందిన సిద్దేశ్వర్‌రెడ్డి అనే కుర్రాడు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఆంగ్లం పరీక్ష రాశాడు.తనకు కచ్చితంగా 90 మార్కులు పైన వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. కానీ, ఫలితాల నాడు కేవలం 57 మార్కులే రావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఏదో తేడా జరిగిందని పునఃపరిశీలనకు దరఖాస్తు పెట్టుకున్నాడు.

తాజాగా వచ్చిన పునఃపరిశీలన ఫలితాల్లో తను అనుకున్నట్లుగా 92 మార్కులు వచ్చాయి. ఈ లెక్కన దాదాపుగా 35 మార్కులు పెరిగనట్లుగా స్పష్టమైంది. ఇలాంటి తప్పిదాలు అడపాదడపా జరుగుతూనే ఉంటాయి కానీ, మరీ ఇంతలా 35 మార్కులు తేడా రావడంతో ఈ వార్త తెలిసిన వాళ్ళందరూ పరీక్షా పేపర్లు దిద్దిన వ్యక్తులపై మండిపడుతున్నారు. కొంతమంది సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ వార్తను పంచుకొని, తమకు కూడా గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినట్లుగా తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు.

Show comments