iDreamPost
android-app
ios-app

కాలేజీలో విద్యార్థులకు కొత్త రూల్! చిరిగిన జీన్స్, టీ షర్ట్స్ బ్యాన్!

  • Published Jul 02, 2024 | 11:02 PM Updated Updated Jul 02, 2024 | 11:02 PM

ఇటీవల కాలంలో చాలామంది విద్యార్థులు స్కూల్స్, కాలేజీలకు నచ్చిన ఫ్యాషన్ డ్రెస్ లు ధరించడం, మతపరమైన డ్రెస్ లు ధరించడం వంటివి చేస్తున్నారు. వీటి వలన చాలా కాలేజీల్లో ఈవీటీజింగ్, మత పరమైన ఘర్షణలు కూడా చోటు చేసుకునే ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా ఈ కల్చర్ ను నిషేధించడానికి దేశంలోని ఓ కళాశాల యాజమాన్యం కఠిన నియమాలను అమలులోకి తీసుకొచ్చింది. దీంతో ఆ కళాశాల ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంతకి ఎక్కడంటే..

ఇటీవల కాలంలో చాలామంది విద్యార్థులు స్కూల్స్, కాలేజీలకు నచ్చిన ఫ్యాషన్ డ్రెస్ లు ధరించడం, మతపరమైన డ్రెస్ లు ధరించడం వంటివి చేస్తున్నారు. వీటి వలన చాలా కాలేజీల్లో ఈవీటీజింగ్, మత పరమైన ఘర్షణలు కూడా చోటు చేసుకునే ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా ఈ కల్చర్ ను నిషేధించడానికి దేశంలోని ఓ కళాశాల యాజమాన్యం కఠిన నియమాలను అమలులోకి తీసుకొచ్చింది. దీంతో ఆ కళాశాల ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Jul 02, 2024 | 11:02 PMUpdated Jul 02, 2024 | 11:02 PM
కాలేజీలో విద్యార్థులకు కొత్త రూల్!  చిరిగిన జీన్స్, టీ షర్ట్స్ బ్యాన్!

ప్రస్తుతం అందరూ ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నారు. ముఖ్యంగా యువత అయితే ఈ విషయంలో ఎప్పటికప్పడు లేటెస్ట్ ట్రెంట్ నే ఎక్కువగా ఫాలో అవుతుంటారు.ఈ క్రమంలోనే.. ఇంట, బయట, స్కూల్స్, కాలేజీలంటూ తేడా లేకుండా.. తమకు నచ్చిన విధంగా ఫ్యాషన్ దుస్తులను ధరిస్తుంటారు. అయితే సాధారణంగా ఏ స్కూల్స్, కాలేజీలకైనా యూనీఫారమ్ అనే డ్రెస్ కోడ్ ఉంటుంది. కానీ, ఈ డ్రెస్ కోడ్ అనేది కొన్ని కళశాలల్లో కొంతమంది విద్యార్థులు పాటించకుండా.. తమకు నచ్చిన ఫ్యాషన్ డ్రెస్ లను ధరించడం, మతపరమైన డ్రెస్ లను ధరించడం వంటివి చేస్తుంటారు. అయితే వీటి వలన కాలేజీల్లో ఈవీటీజింగ్, మత పరమైన ఘర్షణలు కూడా చోటు చేసుకునే ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా ఈ కల్చర్ ను నిషేధించడానికి దేశంలోని ఓ కళాశాల యాజమాన్యం కఠిన నియమాలను అమలులోకి తీసుకొచ్చింది. దీంతో ఆ కళాశాల ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంతకి ఎక్కడంటే..

దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలోని ఓ కళాశాలలో.. విద్యర్థుల దుస్తుల విషయంలో యాజమాన్యం కఠిన నియమాలను అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే సోమవారం చెంబూర్‌లోని ఆచార్య, మరాఠే కళాశాల విద్యార్థుల్లో జీన్స్, టీ షర్టు ధరించి కళాశాలోకి వస్తున్న వారిని లోపలికి రాకుండా యాజమాన్యం అడ్డుకుంది. దీంతో విద్యార్ధులను ఒక్కసారి అలా అడ్డుకునే సరికి అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతేకాకుండా.. గత నెల జూన్ 27 2024 నాడు డ్రెస్ కోడ్ పేరుతో కాలేజీ యాజమాన్యం ఓ నోటీసు విడుదల చేసింది. ఇక ఆ నోటీసులో.. విద్యార్థులు  కాలేజీ క్యాంపస్ లో ఉన్నప్పుడు చిరిగిన జీన్స్, టీ-షర్టులు, బహిర్గతమయ్యే దుస్తులు, జెర్సీలు దరించవద్దని, కేవలం ఫార్మల్, డిసెంట్ డ్రెస్ మాత్రమే ధరించాలని పేర్కొన్నారు.

ఇక అమ్మాయిలైతే ఏదైనా భారతీయ పాశ్చాత్య దుస్తులను ధరించవచ్చు కానీ, మతం, సాంస్కృతిక అసమానతలను చూపించే దుస్తులను ధరించకూడదని ఆ నోటీసులో తెలిపారు. అంతేకాకుండా.. నకాబ్, హిజాబ్, బుర్ఖా, స్టోల్, క్యాప్, బ్యాడ్జ్ లాంటి డ్రెస్ లు గ్రౌండ్ ఫ్లోర్‌లోని సాధారణ గదులకు వెళ్లి తొలగించాలని, ఆ తర్వాతే కాలేజీ క్యాంపస్ లోకి అనుమతి ఇవ్వబడుతుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. హిజాబ్‌ను నిషేధించిన ఇన్‌స్టిట్యూట్ డ్రెస్ కోడ్‌ను సవాలు చేస్తూ.. కాలేజీ విద్యార్థులు బాంబే హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కొన్ని రోజులకే కాలేజీ యాజమాన్యం జీన్స్, టీ-షర్ట్‌లను నిషేధిస్తూ కాలేజీ కొత్త డ్రెస్ కోడ్‌ను జారీ చేసింది.

దీంతో కాలేజీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం విద్యార్థుల అడ్మిషన్ల సమయంలోనే వారికి డ్రెస్ కోడ్ ని తెలియజేశామని, కానీ, ఇప్పుడు దాని కోసం మాకు తెలియదంటూ విద్యార్థులు కాలేజీ బయట ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదని యాజమాన్యం పేర్కొంది. మరి, ముంబాయిలోని కళాశాలల్లో విద్యర్థులకు జీన్స్, మత సంబంధమైన డ్రెస్ లను నిషేధించిన పద్ధతి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.