iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు గొప్ప శుభవార్త.. కేంద్రం నుంచి 15 లక్షలు పొందండిలా!

  • Published Jun 03, 2024 | 4:10 PM Updated Updated Jun 03, 2024 | 4:10 PM

విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాళ్ల కోసం ఓ మంచి స్కీమ్​ను తీసుకొచ్చింది. ప్రభుత్వం నుంచి రూ.15 లక్షలు పొందొచ్చు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాళ్ల కోసం ఓ మంచి స్కీమ్​ను తీసుకొచ్చింది. ప్రభుత్వం నుంచి రూ.15 లక్షలు పొందొచ్చు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 03, 2024 | 4:10 PMUpdated Jun 03, 2024 | 4:10 PM
విద్యార్థులకు గొప్ప శుభవార్త.. కేంద్రం నుంచి 15 లక్షలు పొందండిలా!

ఈ రోజుల్లో ఖర్చులు బాగా పెరిగిపోయాయి. మార్కెట్​లో ఏ వస్తువు కొనాలన్నా భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సిందే. నిత్యావసరాల దగ్గర నుంచి కాయగూరల వరకు ఏది ముట్టుకున్నా భగ్గుమంటున్నాయి. ఇంక చదువుల సంగతి సరే సరి. నర్సరీ, ఎల్​కేజీ ఫీజులే ఆకాశాన్ని తాకుతున్నాయి. పదో తరగతి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదివించడమే కష్టంగా మారింది. లక్షలకు లక్షలు ఫీజులు ఉండటంతో ఉన్నత విద్య అంటేనే చాలా మంది భయపడుతున్నారు. అయినా భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఎంతో కష్టపడి తమ పిల్లల్ని చదివిస్తున్నారు. కొందరు అప్పులు చేసి మరీ ఫీజులు కడుతున్నారు. ఈ సమయంలో విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

స్కూల్, ఇంటర్మీడియట్ కంటే ఉన్నత విద్య మరింత ఖరీదుగా మారుతోంది. దీంతో చాలా మంది ఈ ఆపై చదువులు చదవలేక ఆపేస్తున్నారు. కొందరు పేరెంట్స్ అప్పులు చేసి ఎలాగోలా పిల్లల్ని హయ్యర్ ఎడ్యుకేషన్​కు పంపిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్యకు చాలా మంది దూరమవుతున్నారనే విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది. ఈ క్రమంలో స్టూడెంట్స్ కోసం 2015లో పీఎం విద్యా లక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ యోజన అనే స్కీమ్​ను స్టార్ట్ చేసింది. ఈ పథకం కింద మన దేశంలోని పౌరులు ఉన్నత విద్య కోసం రూ.15 లక్షల దాకా బ్యాంక్ నుంచి లోన్ పొందొచ్చు. ఈ పథకానికి అర్హులైన వారు ఆన్​లైన్​లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్మీడియెట్ లేదా 10+2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు విద్యా లక్ష్మి ఎడ్యుకేషన్ స్కీమ్​కు అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద స్వదేశంలో చదువుకుంటే రూ.7.5 లక్షలు, అదే విదేశాల్లో చదుకోవాలనుకునే వారైతే రూ.15 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ఈ స్కీమ్ వడ్డీ రేటు 8.40 శాతం నుంచి మొదలవుతుంది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు https://www.vidyalakshmi.co.in/Students/ వెబ్​సైట్​ను విజిట్ చేయొచ్చు. ఇందులోనే లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొదట వెబ్​సైట్​లోకి వెళ్లి రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్​ను నింపాలి. లోన్ కోసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లేదా పాన్ కార్డుతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫొటో ఉండాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్‌గా కరెంట్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, బ్యాంకు స్టేట్‌మెంట్, గ్యాస్ బిల్లు లాంటివి సబ్మిట్ చేయొచ్చు. ఈ డాక్యుమెంట్స్​తో పాటు తల్లిదండ్రుల ఇన్‌కమ్ సర్టిఫికెట్, హైస్కూల్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్‌ ఫొటోకాపీలు అందించాలి.