భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో స్టీవ్ స్మిత్ శతకంతో రాణించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌట్ అయింది. మార్నస్ లబుషేన్ 91 పరుగులు సాధించి తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
ఓవర్‌నైట్ స్కోర్ 166/2తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు లబుషేన్,స్మిత్ జోడి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారీ స్కోరుకు బాటలు వేస్తున్న సమయంలో జడేజా టీమ్ ఇండియాకి బ్రేక్ ఇచ్చాడు. జడేజా బౌలింగ్‌లో లబుషేన్ రహానె చేతికి చిక్కడంతో ఆస్ట్రేలియా వికెట్ల పతనం మొదలైంది. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 172 పరుగులు జోడించిన ఆస్ట్రేలియా మిగిలిన 8 వికెట్లను కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన స్మిత్ ఆస్ట్రేలియాను మెరుగైన స్థితిలో నిలిపాడు.ధాటిగా ఆడుతున్న స్మిత్ ను జడేజా రన్ ఔట్ చేయడంతో స్మిత్ పోరాటం ముగిసింది. టీమ్‌ఇండియా బౌలర్లలో జడేజా 4, బుమ్రా, సైని 2, సిరాజ్ 1 వికెట్ సాధించారు.
అనంతరం బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా 4 ఓవర్లలో 11 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 7,శుభమన్ గిల్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.