iDreamPost
android-app
ios-app

BB నుంచి ఈ వారం బయటకు వచ్చేది అతనేనా ?

  • Published Sep 16, 2025 | 1:03 PM Updated Updated Sep 16, 2025 | 1:03 PM

తెలుగు బిగ్ బాస్ హౌస్ సీజన్ 9 మొదటి వారం నుంచే చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. కొత్త పరిచయాలు , గొడవలు , ఏడుపులు, ఆటలు ఇలా కొనసాగుతూ ఉంది. మొదటి వారం కొరియోగ్రాఫర్ స్రష్టి వర్మ బయటకు వచ్చేసింది. ఇక రెండో వారం నామినేషన్స్ కూడా అవుతున్నాయి. ఈ వారం హౌస్ లో నుంచి మాస్క్ మ్యాన్ బయటకు వచేస్తాడనే టాక్ వినిపిస్తుంది.

తెలుగు బిగ్ బాస్ హౌస్ సీజన్ 9 మొదటి వారం నుంచే చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. కొత్త పరిచయాలు , గొడవలు , ఏడుపులు, ఆటలు ఇలా కొనసాగుతూ ఉంది. మొదటి వారం కొరియోగ్రాఫర్ స్రష్టి వర్మ బయటకు వచ్చేసింది. ఇక రెండో వారం నామినేషన్స్ కూడా అవుతున్నాయి. ఈ వారం హౌస్ లో నుంచి మాస్క్ మ్యాన్ బయటకు వచేస్తాడనే టాక్ వినిపిస్తుంది.

  • Published Sep 16, 2025 | 1:03 PMUpdated Sep 16, 2025 | 1:03 PM
BB నుంచి  ఈ వారం బయటకు వచ్చేది అతనేనా ?

తెలుగు బిగ్ బాస్ హౌస్ సీజన్ 9 మొదటి వారం నుంచే చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. కొత్త పరిచయాలు , గొడవలు , ఏడుపులు, ఆటలు ఇలా కొనసాగుతూ ఉంది. మొదటి వారం కొరియోగ్రాఫర్ స్రష్టి వర్మ బయటకు వచ్చేసింది. ఇక రెండో వారం నామినేషన్స్ కూడా అవుతున్నాయి. ఈ వారం హౌస్ లో నుంచి మాస్క్ మ్యాన్ బయటకు వచేస్తాడనే టాక్ వినిపిస్తుంది. కామనర్స్ లో ఈ మాస్క్ మ్యాన్ మొదటి నుంచి కూడా డిఫరెంట్ గానే ఉంటూ వచ్చాడు. అగ్నిపరీక్ష స్టేజ్ మీద మొదటి సారి ఎంట్రీ ఇచ్చినప్పుడు బిందు మాదవి అతని మేడలో లూజర్ బోర్డు వేసింది. కానీ మళ్లీ ఆమె అతనిని హౌస్ లోకి పంపించడానికి సెలెక్ట్ చేసింది.

మొదట్లో హరీష్ బాగానే ఉన్నాడు కానీ ఇప్పుడు అతని తీరు ఆడియన్స్ కు షాక్ ఇస్తుంది. హౌస్ లో ఒకరినొకరు ఎలాంటి కారణాలు లేకపోయినా మాటలు అనుకోవడం కామన్. కానీ హరీష్ కు ఇవేమి నచ్చడం లేదు.. అందరి మీద పగ పెంచేసుకుంటున్నాడని ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. ఒక గొడవ అయిన తరువాత దానిని అక్కడితో వదిలేయకుండా మనసులో పెట్టుకుని కొనసాగిస్తున్నాడు. ఇక మొన్న సండే ఎపిసోడ్ లో నాగార్జున ఆయనకు ఓ విషయంలో క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆరోజు నుంచి అతను ఏమి తినకుండా పస్తులు ఉంటున్నాడు. హౌస్మేట్స్ చెప్పినా , బ్రతిమాలినా కూడా వినడం లేదు. మీలాంటి వాళ్ళ మధ్యలో ఉండాలనుకోవడం లేదు అని అంటున్నాడు. హౌస్ లో ఇలా ఉంటె మాత్రం కొనసాగడం కష్టం. తానూ బిగ్ బాస్ ప్రేమికుడిని అని చెప్పి హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఇలా చేయడం అందరిని షాక్ కు గురిచేస్తుంది. బిగ్ బాస్ చెప్పినా వినకపోతే మాత్రం హరీష్ ఈ వారం డేంజర్ లో ఉన్నట్లే. సో ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.