Swetha
తెలుగు ఇండస్ట్రీల్లో కొంతమంది పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వారిలో తమన్ కూడా ఒకరు. తమన్ స్పెషల్ బీట్స్ తనకంటూ ఓ స్పెషల్ మార్క్ సెట్ చేసుకున్నాడు. ముఖ్యంగా అఖండ సమయంలో తమన్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు మారిపోయింది. అయితే ఇండస్ట్రీ ఎప్పుడు పూలబాట అయితే కాదు. అప్పుడప్పుడు చాలానే అవమానాలు , అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి
తెలుగు ఇండస్ట్రీల్లో కొంతమంది పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వారిలో తమన్ కూడా ఒకరు. తమన్ స్పెషల్ బీట్స్ తనకంటూ ఓ స్పెషల్ మార్క్ సెట్ చేసుకున్నాడు. ముఖ్యంగా అఖండ సమయంలో తమన్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు మారిపోయింది. అయితే ఇండస్ట్రీ ఎప్పుడు పూలబాట అయితే కాదు. అప్పుడప్పుడు చాలానే అవమానాలు , అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి
Swetha
తెలుగు ఇండస్ట్రీల్లో కొంతమంది పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వారిలో తమన్ కూడా ఒకరు. తమన్ స్పెషల్ బీట్స్ తనకంటూ ఓ స్పెషల్ మార్క్ సెట్ చేసుకున్నాడు. ముఖ్యంగా అఖండ సమయంలో తమన్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు మారిపోయింది. అయితే ఇండస్ట్రీ ఎప్పుడు పూలబాట అయితే కాదు. అప్పుడప్పుడు చాలానే అవమానాలు , అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. తమన్ కూడా తన కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు చాలా నెగిటివిటి ఎదుర్కున్నాడు. కాపీ ట్యూన్స్ విషయంలో ఎలాంటి రచ్చ జరిగిందో తెలియనిది కాదు.
తమ అభిమాన హీరోల సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిస్తే.. ఇక సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలుపెట్టేవారు తమన్ వారికి వద్దంటూ అనిరుద్ కావాలంటూ ట్వీట్ లు చేసేవాళ్ళు , పోస్ట్ లు పెట్టేవాళ్ళు. ఇదంతా తమన్ కు చాలా అవమానకరమైన విషయం అయినప్పటికీ ఎక్కడ కూడా అతను వెనక్కు తగ్గలేదు. మహేష్ బాబు సినిమా గుంటూరు కారం మూవీ మ్యూజిక్ ఆల్బమ్ ఎలాంటి హిట్ అయిందో తెలియనిది కాదు . అప్పుడు తమన్ తానేంటో నిరూపించుకున్నాడు. అయినా అది సరిపోలేదు. ఇప్పుడు ఏకంగా కొత్త రికార్డ్స్ సృష్టించడానికి ఓజి ర్యాంపేజ్ తో వచ్చేస్తున్నాడు.
ఓజి నుంచి వస్తున్న ఒక్కో సాంగ్ ఒక్కో సునామి సృష్టిస్తుంది. ఎవరైతే మాకు తమన్ వద్దు అనిరుద్ కావాలని అన్నారో.. ఇప్పుడు అదే ఫ్యాన్స్ అబ్బా ఏమి కొట్టాడ్రా తమన్ అని అంటున్నారు. పవన్ అభిమానులకు ఇన్స్టంట్ గా సాంగ్ ఎక్కేస్తుంటే.. మ్యూజిక్ లవర్స్ కు కాస్త స్లో పాయిజన్ లా సాంగ్ ఎక్కుతుంది. ఇప్పుడు ఈ సాంగ్స్ వింటేనే ఇలా ఉన్నాయంటే ఇక రేపు థియేటర్స్ లో బాక్స్ లు దద్దరిల్లిపోవాల్సిందే అంటూ.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. ఇక సినిమా రావడమే ఆలస్యం.. ఈ హైప్ ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.