iDreamPost
android-app
ios-app

కిష్కింధపురిపై చిరు రివ్యూ

  • Published Sep 16, 2025 | 3:44 PM Updated Updated Sep 16, 2025 | 3:44 PM

సాధారణంగా అయితే సినిమా సెలెబ్రిటీలు రివ్యూలు ఇవ్వడం తక్కువ కానీ ఈ మధ్య తెగ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా. వారికి సినిమా నచ్చితే వెంటనే సోషల్ మీడియాలో ట్వీట్స్ చేసేస్తున్నారు. ఈ మూవీ రివ్యూస్ ఎక్కువగా మహేష్ నుంచి వింటూ ఉంటాము.

సాధారణంగా అయితే సినిమా సెలెబ్రిటీలు రివ్యూలు ఇవ్వడం తక్కువ కానీ ఈ మధ్య తెగ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా. వారికి సినిమా నచ్చితే వెంటనే సోషల్ మీడియాలో ట్వీట్స్ చేసేస్తున్నారు. ఈ మూవీ రివ్యూస్ ఎక్కువగా మహేష్ నుంచి వింటూ ఉంటాము.

  • Published Sep 16, 2025 | 3:44 PMUpdated Sep 16, 2025 | 3:44 PM
కిష్కింధపురిపై చిరు రివ్యూ

సాధారణంగా అయితే సినిమా సెలెబ్రిటీలు రివ్యూలు ఇవ్వడం తక్కువ కానీ ఈ మధ్య తెగ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా. వారికి సినిమా నచ్చితే వెంటనే సోషల్ మీడియాలో ట్వీట్స్ చేసేస్తున్నారు. ఈ మూవీ రివ్యూస్ ఎక్కువగా మహేష్ నుంచి వింటూ ఉంటాము. కానీ ఈసారి మెగాస్టార్ రివ్యూ ఇచ్చారు. అది కూడా ఏకంగా వీడియో రూపంలో రివ్యూ ఇచ్చారు. మొన్న శుక్రవారం మిరాయ్ తో పాటు వచ్చిన కిష్కింధపురి ఎలాంటి టాక్ సంపాదించుకుందో తెలియనిది కాదు.

ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ లభించింది. అలాగే సాయి శ్రీనివాస్ కు కుల మంచి ప్రశంసలు దక్కాయి. వీకెండ్స్ లో థియేటర్స్ కు జనాలను బాగానే రాబట్టింది. అలాగే మినిమమ్ గ్యారెంటీ పర్సెంటేజ్ తో మండే టెస్ట్ కూడా పాస్ అయింది. ఇప్పుడు ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరు ఏమి చెప్పారంటే “కిష్కింధపురి సినిమా నిజంగా నాకు నచ్చింది. ఇది సాధారణ హారర్ మూవీకాకుండా, డైరెక్టర్ కౌశిక్ పగళ్ళపాటి ఒక సైకలాజికల్ యాంగిల్‌ని బాగా చూపించారు. ఆ పాయింట్ చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. అలాగే చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాలోకి మంచి ఎనర్జీని తెచ్చాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అనుపమ పరమేశ్వరన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది.

ఈ ఇద్దరి నటనతో పాటు, టెక్నికల్ వర్క్ కూడా సినిమా స్థాయిని ఎత్తుకు తీసుకెళ్లింది. నా నెక్స్ట్ సినిమా ‘శివ శంకర వరప్రసాద్ గారు’కి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సాహు గారపాటి గారు ఈ చిత్రానికి మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆయన ప్రయత్నం చాలా బాగుంది. ఈ సినిమాను తప్పక థియేటర్లలో చూసి ప్రోత్సహించాలి. ఇది కొత్తగా, వేరే రకం అనుభూతిని ఇస్తుంది” అని చెప్పుకొచ్చారు చిరంజీవి. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏకంగా మెగాస్టార్ ఏ రివ్యూ ఇవ్వడంతో ఇప్పుడు ఇంకొంతమంది ఈ సినిమాను చూసే అవకాశం లేకపోలేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.