Swetha
రాజాసాబ్ నుంచి మొదటి గ్లిమ్ప్స్ రిలీజ్ చేసినప్పుడు.. పాజిటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చాయో.. నెగిటివ్ కామెంట్స్ కూడా అంతే వచ్చాయి. అప్పటినుంచి ఎడిటింగ్ ఎలా ఉంటుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కాస్త టెన్షన్ పడుతున్నారు. పైగా అటు సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తుండడంతో ఆ టెన్షన్ ఇంకాస్త పెరిగింది

రాజాసాబ్ నుంచి మొదటి గ్లిమ్ప్స్ రిలీజ్ చేసినప్పుడు.. పాజిటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చాయో.. నెగిటివ్ కామెంట్స్ కూడా అంతే వచ్చాయి. అప్పటినుంచి ఎడిటింగ్ ఎలా ఉంటుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కాస్త టెన్షన్ పడుతున్నారు. పైగా అటు సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తుండడంతో ఆ టెన్షన్ ఇంకాస్త పెరిగింది. కానీ ఇప్పుడు మిరాయ్ చూసిన తర్వాత అంతా కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఎలాగూ సినిమా సంక్రాంతి కానుకగా రానుంది. ఇందులో అయితే ఎలాంటి డౌట్ లేదు.
ఇక ఇప్పుడు సినిమా విఎఫ్ఎక్స్ విషయంలో కూడా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజాసాబ్ సినిమాకు వర్క్ చేసిన విఎఫ్ఎక్స్ టీం మిరాయ్ కు వర్క్ చేయడం. మిరాయ్ థియేటర్లో విపరీతమైన సక్సెస్ అందుకోవడంతో రాజాసాబ్ మీద ఇప్పుడు అందరికి నమ్మకం రెండింతలు పెరిగింది. పైగా త్వరలో మూవీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఇక డార్లింగ్ ఫ్యాన్స్ కు ఓ హోప్ వస్తుంది.
వంద కోట్ల బడ్జెట్ లోపు తీసిన సినిమాలోనే ఈ రేంజ్ లో ఉంది అంటే ఇక నాలుగు వందల కోట్లంటే ఔట్పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజా సాబ్ లో సంజయ్ దత్ క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా ఉంటుందట. ప్రభాస్ కు తండ్రిగా, తాతగా రెండు షేడ్స్ ఉంటాయని ఇన్ సైడ్ టాక్. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటకు వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.