iDreamPost
android-app
ios-app

మిరాయ్ vs కిష్కింధపురి వసూళ్ళలో ఏదెంత ?

  • Published Sep 13, 2025 | 4:11 PM Updated Updated Sep 13, 2025 | 4:11 PM

చాలా రోజుల తర్వాత ఒకేవారం థియేటర్లో ఎంట్రీ ఇచ్చిన సినిమాలు పాజిటివ్ టాక్ సంపాదించుకున్నాయి. దేనికి దానికే తోప్ అనిపించుకున్నాయి. దానికి కారణం రెండు కూడా అసలు సింక్ లేని సెపరేట్ జోనర్స్ కావడమే. అయితే అసలు ఎలాంటి తప్పులు యావరేజ్ టాక్ లు రాలేదని కాదు కానీ. మెజారిటీ పాజిటివ్ టాక్స్ మధ్యన చిన్న చిన్న తప్పులు కనిపించలేదు.

చాలా రోజుల తర్వాత ఒకేవారం థియేటర్లో ఎంట్రీ ఇచ్చిన సినిమాలు పాజిటివ్ టాక్ సంపాదించుకున్నాయి. దేనికి దానికే తోప్ అనిపించుకున్నాయి. దానికి కారణం రెండు కూడా అసలు సింక్ లేని సెపరేట్ జోనర్స్ కావడమే. అయితే అసలు ఎలాంటి తప్పులు యావరేజ్ టాక్ లు రాలేదని కాదు కానీ. మెజారిటీ పాజిటివ్ టాక్స్ మధ్యన చిన్న చిన్న తప్పులు కనిపించలేదు.

  • Published Sep 13, 2025 | 4:11 PMUpdated Sep 13, 2025 | 4:11 PM
మిరాయ్ vs కిష్కింధపురి వసూళ్ళలో ఏదెంత ?

చాలా రోజుల తర్వాత ఒకేవారం థియేటర్లో ఎంట్రీ ఇచ్చిన సినిమాలు పాజిటివ్ టాక్ సంపాదించుకున్నాయి. దేనికి దానికే తోప్ అనిపించుకున్నాయి. దానికి కారణం రెండు కూడా అసలు సింక్ లేని సెపరేట్ జోనర్స్ కావడమే. అయితే అసలు ఎలాంటి తప్పులు యావరేజ్ టాక్ లు రాలేదని కాదు కానీ. మెజారిటీ పాజిటివ్ టాక్స్ మధ్యన చిన్న చిన్న తప్పులు కనిపించలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి చూసి ప్రేక్షకులు భయపడితే.. మిరాయ్ చూసి థ్రిల్ ఫీల్ అయ్యారు. మరి ఈ రెండు సినిమాలలో మొదటి రోజు ఏది ఎంత రాబట్టింది అనే విషయానికొస్తే..

మొదటి రోజు తేజ సజ్జా నటించిన మిరాయ్ మూవీ ఏకంగా రూ.27.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు అఫీషియల్ గా టీం అనౌన్స్ చేశారు. దీనితో మిరాయ్ టీం అంతా సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక కిష్కింధపురి సినిమా విషయానికొస్తే.. ఈ టీం నుంచి మొదటిరోజు అఫీషియల్ పోస్టర్స్ ఏమి రాలేదు కానీ మొదటి రోజు యావరేజ్ వసూళ్లు వచ్చినట్లు టాక్. తెలుగులో మాత్రమే ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి దేశవ్యాప్తంగా రూ.2 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

అయితే ఎటు 25 వరకు కొత్త రిలీజ్ లు ఏమి లేవు కాబట్టి.. ప్రస్తుతం ఎలాగూ పాజిటివ్ మౌత్ టాక్ బాగానే స్ప్రెడ్ అయింది కాబట్టి రానున్న రోజుల్లో కిష్కింధపురికి కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే కనేంట్ అండ్ కాన్సెప్ట్ తో మలయాళం నుంచి సినిమా వస్తే ప్రేక్షకులు కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ చేసేవాళ్ళని.. ఇప్పుడు కచ్చితంగా ఈ సినిమాను సపోర్ట్ చేయాలనీ సోషల్ మీడియాలో డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. ఇక మండేకి కానీ వసూళ్ల ప్రెడిక్షన్ ఓ కొలిక్కి రాదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.