Swetha
గత కొంతకాలంగా సినిమాల టికెట్స్ రేట్స్ పెరిగిన సంగతి తెలిసిందే. మిడ్ రేంజ్ సినిమాలకు ఓ రేటు పెద్ద సినిమాలకు మరో రేటు. ఇక ప్రీమియర్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన హీరోల కోసం ఈ మాత్రం కూడా పెట్టుకోలేమా అంటూ కొంతమంది కల్ట్ ఫ్యాన్స్ అయితే బయటకు వస్తున్నార్లే కానీ.. చాలా మంది ఆడియన్స్ థియేటర్స్ కు వెళ్లాలంటే భయపడుతున్నారు
గత కొంతకాలంగా సినిమాల టికెట్స్ రేట్స్ పెరిగిన సంగతి తెలిసిందే. మిడ్ రేంజ్ సినిమాలకు ఓ రేటు పెద్ద సినిమాలకు మరో రేటు. ఇక ప్రీమియర్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన హీరోల కోసం ఈ మాత్రం కూడా పెట్టుకోలేమా అంటూ కొంతమంది కల్ట్ ఫ్యాన్స్ అయితే బయటకు వస్తున్నార్లే కానీ.. చాలా మంది ఆడియన్స్ థియేటర్స్ కు వెళ్లాలంటే భయపడుతున్నారు
Swetha
గత కొంతకాలంగా సినిమాల టికెట్స్ రేట్స్ పెరిగిన సంగతి తెలిసిందే. మిడ్ రేంజ్ సినిమాలకు ఓ రేటు పెద్ద సినిమాలకు మరో రేటు. ఇక ప్రీమియర్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన హీరోల కోసం ఈ మాత్రం కూడా పెట్టుకోలేమా అంటూ కొంతమంది కల్ట్ ఫ్యాన్స్ అయితే బయటకు వస్తున్నార్లే కానీ.. చాలా మంది ఆడియన్స్ థియేటర్స్ కు వెళ్లాలంటే భయపడుతున్నారు. భారీ పెట్టుబడులు , భారీ రెమ్యునరేషన్స్ , భారీ ఖర్చులు , అమ్మకాలు , భారీ టికెట్ ధరలు . కలెక్షన్లు ఇలా ఇండస్ట్రీ అంతా భారీ భారీగానే నడుస్తుంది. పోనీ వచ్చే సినిమాలేమైనా అదిరిపోయేలా ఉన్నాయా అంటే అది కూడా లేదు
ఇలాంటి టైం లో మిరాయ్ లాంటి భారీ బడ్జెట్ మూవీ వచ్చింది. టిజి విశ్వప్రసాద్ కు టికెట్స్ కు అదనపు రేట్స్ పెంచడానికి పెర్మిషన్ అడిగే అవకాశం ఉంది. అయినా సరే ఆయన అదనపు రేట్లు కోరలేదు. నార్మల్ రేట్స్ తోనే సినిమాను రిలీజ్ చేశారు. ఎక్కువమంది తమ సినిమాను చూడాలని అనుకున్నారు. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయినా కిష్కిందపురి కూడా నార్మల్ రేట్స్ కే రిలీజ్ అయింది. ఇప్పుడు వారు అనుకున్నట్టుగానే సినిమా రీచ్ బావుంది. టాక్ బావుండడంతో రెండు సినిమాలు కూడా మరింతమంది క్రౌడ్ ను థియేటర్స్ కు పుల్ చేయగలుగుతున్నారు.
ఇప్పటికే చాలా చోట్ల కలెక్షన్స్ నెంబర్లు భారీగా వినిపిస్తున్నాయి. ఒకవేళ టికెట్ రేట్లు పెంచితే ఈ నెంబర్ల రేట్ ఇంకా బావుండేదేమో. అయినా ఏమి పర్లేదు. పైగా రేట్స్ తగ్గించినా థియేటర్స్ లో పై క్లాస్ టికెట్స్ ఏ ఎక్కువ బుక్ అవుతున్నాయి. ఇలా మొత్తం మీద ఎలా చూసుకున్నా టికెట్స్ రేట్స్ తగ్గించడం సినిమాలను బాగానే ప్లస్ పాయింట్ అయింది. పైగా సినిమాలు బావుండడంతో ప్రేక్షకులు అటు సినిమాతోనూ ఇటు టికెట్ రేట్స్ తోను శాటిస్ఫై అయ్యారు. ఇక ముందు ముందు వచ్చే సినిమాలు ఇలాంటి పద్దతులను ఫాలో అవుతాయో లేదో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.