Swetha
ఇండస్ట్రీ ఓ హిట్ పడగానే ఇక ఆ హీరో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ మీద అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. అఫ్కోర్స్ తీసిన ప్రతి సినిమా ఆడాలని హిట్ అవ్వాలనే రూల్ లేదు. కంటెంట్ బావుంటే ఆటొమ్యాటిక్ గా సినిమాలు హిట్ అవుతూనే ఉంటాయి. ఈ విషయం చిన్న సినిమాలు , ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాల విషయంలో ఇది ప్రూవ్ అయింది
ఇండస్ట్రీ ఓ హిట్ పడగానే ఇక ఆ హీరో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ మీద అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. అఫ్కోర్స్ తీసిన ప్రతి సినిమా ఆడాలని హిట్ అవ్వాలనే రూల్ లేదు. కంటెంట్ బావుంటే ఆటొమ్యాటిక్ గా సినిమాలు హిట్ అవుతూనే ఉంటాయి. ఈ విషయం చిన్న సినిమాలు , ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాల విషయంలో ఇది ప్రూవ్ అయింది
Swetha
ఇండస్ట్రీ ఓ హిట్ పడగానే ఇక ఆ హీరో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ మీద అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. అఫ్కోర్స్ తీసిన ప్రతి సినిమా ఆడాలని హిట్ అవ్వాలనే రూల్ లేదు. కంటెంట్ బావుంటే ఆటొమ్యాటిక్ గా సినిమాలు హిట్ అవుతూనే ఉంటాయి. ఈ విషయం చిన్న సినిమాలు , ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాల విషయంలో ఇది ప్రూవ్ అయింది. ఒకవేళ సినిమా ప్లాప్ అయిందంటే హీరో మీద నిందలు పడిపోతూ ఉంటాయి. అందుకె ఓ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరోలు చాలా జాగ్రత్తగా కథలను ఎంచుకుంటూ ఉంటారు. అలా ఎంచుకోవడంలో కొందరు ఫెయిల్ అవుతారు. కొందరు సక్సెస్ అవుతారు.
తేజ సజ్జా మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. జాంబిరెడ్డి లాంటి హిట్ ఇచ్చి వెంటనే హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇప్పుడు మిరాయ్ తో మ్యాజిక్ చేశాడు. దీనితో ఈ కుర్ర హీరో మీద అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇక మిరాయ్ తర్వాత తేజ సజ్జ నెక్ట్ ప్రాజెక్ట్ ఏంటా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే మరో మూడు నాలుగేళ్ల పాటు ఈ కుర్ర హీరోకు కొత్త కథలతో పని లేనట్టుగానే కనిపిస్తుంది.
ఎందుకంటే ఇప్పుడు జాంబీరెడ్డి2 మీద ఫోకస్ చేస్తున్నడట. అది అయిపోయిన వెంటనే హనుమాన్ పార్ట్ 2 ఎలాగూ ఉంది. ఇక అది అయ్యే సమయానికి మిరాయ్ 2 లైన్ లోకి వస్తుంది. ఇలా వరుసగా తేజ సజ్జా చేతిలో సిక్వెల్స్ ఏ కనిపిస్తున్నాయి. తర్వాత తర్వాత తేజ నుంచి వచ్చే సినిమాలు ఎలా ఉంటాయో తెలీదు. కానీ.. ప్రస్తుతానికి మాత్రం ఓ ప్లానింగ్ ఓ పద్దతి అంటూ ఈ హీరో ఆచి తూచి అడుగులు వేస్తూ వెళ్తున్నాడు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.