ఓటిటి హక్కులకే 80 కోట్లా?

  • Updated - 03:53 PM, Tue - 31 January 23
ఓటిటి హక్కులకే 80 కోట్లా?

ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లిన మహేష్ బాబు 28 సెట్స్ పై ఉండగానే సంచలనాలు నమోదు చేస్తోంది. దీని ఓటిటి హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సంక్రాంతి పండగ సందర్భంగా సదరు సంస్థే అఫీషియల్ గా ప్రకటించింది. అయితే ఎంత మొత్తమనేది బయటికి చెప్పలేదు. లేటెస్ట్ గా వచ్చిన లీక్ ప్రకారం అది 80 కోట్ల ఉందట. మాములుగా ఇది చాలా పెద్ద మొత్తం. ఎలా అంటే క్యాస్టింగ్ రెమ్యునరేషన్లు పక్కనపెడితే కేవలం ప్రొడక్షన్ కాస్ట్ టోటల్ దాదాపుగా దీంతోనే రికవరీ అయిపోతుంది.

ఇది అధికారికంగా చెప్పకపోయినా నిజమయ్యే అవకాశాలు ఎక్కువే. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాదిలో భారీ బడ్జెట్ చిత్రాలకు పెద్ద గేలం వేస్తోంది. చిరంజీవి గాడ్ ఫాదర్ 55 కోట్లు, వాల్తేరు వీరయ్య భోళా శంకర్ లకు చెరో 50 కోట్లు పెట్టి కొనడానికి కారణం ఇదే. ఈ లెక్కన చూస్తే మహేష్ మూవీకి ఇచ్చింది రీజనబుల్ డీలే. తెలుగుతో పాటు ఇతర బాషలకు డబ్బింగ్ చేసుకుని స్ట్రీమింగ్ చేసే రైట్స్ కూడా ఇందులోనే ఉంటాయయట. మలయాళంలో ఈ మోడల్ ని ఫాలో అవుతున్న నెట్ ఫ్లిక్స్ ఇకపై తెలుగుకు ఇదే వర్తింపజేయనుంది

ఆగస్ట్ లో విడుదల కాబోతున్న ఈ ఫ్యామిలీ కం ఎమోషనల్ ఎంటర్ టైనర్ ని ఎట్టిపరిస్థితుల్లో ఆలస్యం జరగకుండా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేసుకున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు కాగా జగపతిబాబు మెయిన్ విలన్ గా నటిస్తున్నట్టు టాక్. తమన్ ఆల్రెడీ స్వరాలు సమకూర్చే పనిలో బిజీ అయ్యాడు. అల వైకుంఠపురములో తర్వాత గ్యాప్ ని పూడ్చుకుని దాన్ని మించిన బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే పట్టుదలతో త్రివిక్రమ్ ఉండగా సర్కారు వారి పాట ఆశించిన స్థాయిలో వెళ్లలేదనే అసంతృప్తిలో ఉన్న మహేష్ కు సైతం ఇది పెద్ద సక్సెస్ కావడం చాలా కీలకం.

Show comments