iDreamPost
android-app
ios-app

OTT లో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘ఒబ్లివిఒన్’.. గ్రహాంతర వాసులు భూమిపై దాడి చేస్తే!

  • Published Sep 14, 2024 | 11:30 PM Updated Updated Sep 14, 2024 | 11:30 PM

OTT Best Science Fiction Thriller -Oblivion: సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఈ మధ్య ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. మరి అదే తరహాలో ఉన్న ఈ సినిమాను చూసారో లేదో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఫుల్ డీటెయిల్స్ చూసేయండి.

OTT Best Science Fiction Thriller -Oblivion: సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఈ మధ్య ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. మరి అదే తరహాలో ఉన్న ఈ సినిమాను చూసారో లేదో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఫుల్ డీటెయిల్స్ చూసేయండి.

  • Published Sep 14, 2024 | 11:30 PMUpdated Sep 14, 2024 | 11:30 PM
OTT లో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘ఒబ్లివిఒన్’.. గ్రహాంతర వాసులు భూమిపై దాడి చేస్తే!

కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతుంది. ఒకవేళ ఏలియన్స్ భూమి మీదకు వచ్చి అంత ఆక్రమించుకుంటే ఏమౌతుంది. ఇలాంటివన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇవన్నీ సైన్స్ ఫిక్షన్ సినిమాలలో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించడంతో.. ప్రేక్షకులు ఈ సినిమాలను చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడే వారు ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సినిమా విషయానికొస్తే.. భూమి పై గ్రహాంతల వాసులు దాడి చేస్తే భూమిపై మనుషులకు నివాసం లేకపోతే.. ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపిస్తారు. సెవెంజర్స్ అనే గ్రహాంతల వాసులను వాళ్ళ సొంత గ్రహం నుంచి వెలివేయడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక.. భూమి మీదకు వస్తారు. దీనితో వారికి మనుషులకు మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధం తీవ్ర స్థాయికి చేరడంతో.. చివరకు న్యూక్లియర్ బాంబ్స్ ను కూడా ఉపయోగించాల్సి వస్తుంది. దానితో యుద్ధంలో గెలుస్తారు. కానీ భూమిపై రేడియషన్ ఎక్కువయ్యి.. నివసించడానికి పనికిరాకుండా పోతుంది. అయితే అదే యుద్ధంలో సెవెంజర్స్ చంద్రుడిని కూడా నాశనం చేస్తారు. చంద్రుడు లేకపోవడంతో.. భూమిపై భూకంపాలు , సునామీలు వస్తాయి. దానితో భూమిపై ఉన్న మనుషులంతా టైటాన్ మీదకు షిఫ్ట్ అవుతారు.

అయితే టైటాన్ మీద మనుషులు నిర్మించుకున్న కొత్త కాలనీలకు పవర్ కావలి కాబట్టి..భూమిపై నుంచే పవర్ సప్లై ను టైటాన్ కు పంపిస్తూ ఉంటారు. అదే సమయంలో భూమిపై జరిగిన యుద్ధంలో సెవెంజర్స్ ఓడిపోవడంతో.. మనుషులు నిర్మించిన పవర్ గ్రిడ్స్ ను నాశనం చేయడం, బాగుచేయడానికి వచ్చిన ఇంజినీర్స్ ను చంపేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా మనుషులకు గ్రహాంతర వాసులకు మధ్య తరచూ యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది ? ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు ? గ్రహాంతర వాసులు భూమిని విడిచిపెట్టి వెళ్తారా లేదా ? కథ ఎలా ముగుస్తుంది ? ఇవన్నీ తెలియాలంటే ‘ఒబ్లివిఒన్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వేంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.