Krishna Kowshik
Krishna Kowshik
అదృష్టం వరించింది అనుకుంటే.. తిండి పెట్టే ఉద్యోగం పోయింది. దీంతో ఏం దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ఆ ఎస్సై. క్రికెట్ అంటే ఇష్టం, బెట్టింగ్ అంటే మోజుతో.. తన లక్‌ను పరీక్షించుకున్నాడు. మహారాష్ట్ర పింప్రీ-ఛింఛ్వాడ్ పోలీస్ కమీషనరేట్ ఎస్సై సోమనాథ్. ఆన్ లైన్ బెట్టింగ్ ద్వారా కోటిన్నర రూపాయలు కొల్లగొట్టాడు. పండుగకు ముందే లక్ష్మి దేవి వరించిందని ఇంటిల్లి పాది మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఐతే, ఆ ఆనందం ఎంత సేపు మిగళ్లేదు. లక్ష్మి వరించే లోపు అన్నపూర్ణ దేవి కాలితో తన్నినట్లు అయ్యింది. అతడిని ఉన్నతాధికారులు ఉన్నపళంగా ఉద్యోగంలో నుండి తీసేశారు. ఇంతకు ఎందుకు ఆయన్ను తొలగించారంటే..?
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11లో సోమనాథ్ గత మూడు నెలలుగా పందెం కాస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీన జరిగిన ఇంగ్లాండ్-బంగ్గాదేశ్ మ్యాచ్ పై బెట్టింగ్ వేయగా.. బాగా ఆడిన ఆటగాళ్లను ఎంపిక చేసుకోగా.. ప్రిడిష్కన్ కరెక్ట్ అయ్యి టాప్ ప్లేసుకు వెళ్లడంతో.. కోటిన్నర గెలుచుకున్నారు. దీంతో తనెంతో లక్కీ పర్సన్ అంటూ మురిసిపోయారు సోమనాథ్, ఆయన కుటుంబ సభ్యులు. ఆ డబ్బులను పిల్లల చదువుకు, ఇంటి రుణానికి, మిగిలినదీ ఫిక్స్ డిపాజిట్ చేసుకోవాలని ప్రణాళికలు వేసుకున్నాడు. అంతలోనే ఆనందం ఆవిరి అయిపోయింది. అతడు నిబంధనలను అతిక్రమించాడని, పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ అతడిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఆ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతడు విధుల్లో ఉన్నాడని, ఆ సమయంలో బెట్టింగ్ వేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు అతడిని సస్పెండ్ చేస్తూ.. తదుపరి విచారణ జరిపించాలని డీసీపీని ఆదేశించారు.