iDreamPost
android-app
ios-app

Pushpa song Saami Saami : రంగమ్మతో శ్రీవల్లి పోలిక – ఏది బెస్ట్

  • Published Oct 28, 2021 | 9:29 AM Updated Updated Oct 28, 2021 | 9:29 AM
Pushpa song Saami Saami : రంగమ్మతో శ్రీవల్లి పోలిక – ఏది బెస్ట్

ఇవాళ పుష్ప పార్ట్ 1 నుంచి సామీ సామీ లిరికల్ వీడియో రిలీజయింది. అల్లు అర్జున్ రష్మిక మందన్న కాంబోలో కొన్ని సాంగ్ విజువల్స్ కూడా ఇందులో చూపించారు. పాట మాస్ ట్యూన్ లో క్యాచీగా ఉంది కానీ మరీ గొప్పగా చెప్పుకునే స్థాయిలో లేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కారణం లేకపోలేదు. దర్శకుడు సుకుమార్ – మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ – గీత రచయిత చంద్రబోస్ ఈ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. ముఖ్యంగా రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడో గీతం ఏ రేంజ్ లో ఊపేసిందో మర్చిపోవడం అసాధ్యం. ఇప్పుడీ కాంబో రిపీట్ అయ్యింది.

అదే సుక్కు అదే దేవి అదే బోసు కలిసి పుష్ప కోసం దాన్ని మించిన ట్రాక్ ఇస్తారేమో అని ఆశించడం తప్పేమి కాదు కానీ ఇలాంటి కంపారిజన్లను మాత్రం తప్పించుకోలేం. అందుకే రంగమ్మ స్థాయిలో ఈ సామీ అంత ఎక్కలేదేమో అనిపిస్తుంది. అయితే పోను పోను మెల్లగా కనెక్ట్ అయినా ఆశ్చర్యం లేదు. పల్లవిలో చరణాల్లో అర్థం బాగున్నప్పటికీ సామీ సామీ అనే సౌండ్ బాగా ఎక్కువైపోవడం మాత్రం కొంత ఇబ్బందిగానే అనిపించింది. బీట్స్ మాత్రం ఎప్పటిలాగే మాసీగా ఉన్నాయి. మొత్తానికి దేవి నుంచి ఊహించని ఆల్బమ్ వస్తున్నది వాస్తవం. మరి రంగస్థలం, ఉప్పెనల స్థాయిలో ఉంటుందో లేదో చూడాలి.

పుష్ప విడుదలలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. డిసెంబర్ 17 రావడం ఖాయమే అని పలు సందర్భాల్లో బన్నీతో సహా అందరూ స్పష్టం చేస్తున్నారు. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అల్లు అర్జున్ దీని మీద మాములు అంచనాలు పెట్టుకోలేదు. పైగా రెండో భాగం ఉంటుందని ముంచే చెప్పేశారు కాబట్టి బాహుబలి, కెజిఎఫ్ రేంజ్ లో ఇది ఫలితాన్ని రాబట్టుకోవాలి. లేదంటే తర్వాత బిజినెస్ మీద ప్రభావం ఉంటుంది. అందుకే ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా పుష్ప టీమ్ అన్నిరకాలుగా సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో బిజీగా ఉంది. ఆడియోలో ఇంకో రెండు పాటలు ఉన్నాయని టాక్.

ALSO READ – విడాకుల తర్వాతే మొదలయ్యింది