iDreamPost
iDreamPost
గత ఏడాది వి సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డా దానికి తగ్గ ఫలితం అందుకోలేకపోయిన సుధీర్ బాబు కొత్త మూవీ శ్రీదేవి సోడా సెంటర్ ఈ నెల 27 విడుదల కాబోతోంది. వచ్చే నెల నుంచి భారీ చిత్రాలు క్యూ కట్టిన నేపథ్యంలో కొంచెం హడావిడి అయినా సరే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని దీన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. పలాసతో పేరు తెచ్చుకున్న కరుణ కుమార్ దర్శకుడు కావడంతో ఓ వర్గం ప్రేక్షకుల్లో దీని మీద ప్రత్యేక అంచనాలు ఉన్నాయి. అయితే ఇది కమర్షియల్ ఎంటర్ టైనరా లేక ఏదైనా డిఫరెంట్ జానరా అనే కన్ఫ్యూజన్ లేకపోలేదు. ప్రమోషన్ చూస్తేనేమో పక్కా మాస్ మూవీలా అనిపించిన మాట వాస్తవం.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది రివెంజ్ డ్రామా తరహాలో సాగుతుందని సమాచారం. రంగస్థలం, పలాస, ఉప్పెన టైపులో బ్యాక్ డ్రాప్ లో రానెస్ చూపిస్తూనే ఆడియన్స్ థ్రిల్ అయ్యే అంశాలు ఇందులో పొందుపరిచినట్టు చెబుతున్నారు. హీరోయిన్ ఆనందిని క్యారెక్టర్ మెయిన్ హై లైట్ అవ్వబోతోందని వినికిడి. కాకపోతే కథకు సంబంధించిన లీక్స్ ఎక్కువ బయటికి రాకుండా యూనిట్ జాగ్రత్త పడటంతో ఇదేదో మాస్ సినిమా అనే అభిప్రాయం కలిగింది. ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం కూడా ప్రధాన ఆకర్షణలో ఒకటి. దీనికి మంచి అవుట్ ఫుట్ ఇచ్చారని అంటున్నారు.
సుధీర్ బాబుకి ఇది హిట్ కావడం చాలా అవసరం. కంటిన్యూ గా సక్సెస్ లు లేకపోవడం అతని కెరీర్ మీద కొంత ప్రభావం చూపిస్తోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ సపోర్ట్ ఉన్నా అది లాంగ్ రన్ కి ఉపయోగపడదు. అందుకే బాడీ ఫిట్ నెస్ తో మొదలుకుని చాలా అంశాల్లో శ్రద్ధ తీసుకునే సుధీర్ బాబు రిజల్ట్ విషయంలో మాత్రం తడబడుతున్నాడు. ట్రేడ్ నుంచి అందుతున్న టాక్ ప్రకారం శ్రీదేవి సోడా సెంటర్ సుమారుగా 9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్నట్టు తెలిసింది. అంటే మొత్తం గ్రాస్ 14 కోట్ల దాకా రావాల్సి ఉంటుంది. చూస్తుంటే పంపిణీదారులకు దీని మీద గట్టి నమ్మకమే ఉన్నట్టు కనిపిస్తోంది. చూద్దాం
Also Read : ఇంకే డౌట్లు వద్దంటున్న జగదీష్