iDreamPost
android-app
ios-app

తల్లి సురేఖపై శ్రీజ పోస్ట్‌ వైరల్‌.. ఏమన్నదంటే

  • Published Sep 15, 2023 | 3:00 PM Updated Updated Sep 15, 2023 | 3:00 PM
  • Published Sep 15, 2023 | 3:00 PMUpdated Sep 15, 2023 | 3:00 PM
తల్లి సురేఖపై శ్రీజ పోస్ట్‌ వైరల్‌.. ఏమన్నదంటే

సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మెగాస్టార్ చిరంజీవితో మొదలైన వారసత్వం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు అంచెలంచెలుగా ఎదిగింది. నటనను పుణికిపుచ్చుకుని సినీ రంగంలో కొనసాగుతున్నారు వారి వారసులు. రామ్ చరణ్.. టాప్ ఇండియన్ స్టార్ రేంజ్‌కు ఎదగ్గా, వరుణ్ తేజ్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇక కుమార్తెలు సైతం రాణిస్తున్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తుండగా, నాగబాబు తనయ నిహారిక.. తొలుత హీరోయిన్‌గా అవతారమెత్తి.. ఆ తర్వాత ప్రొడ్యూసర్‌గా మారారు. వీరిలో చిరంజీవి ముద్దుల తయన శ్రీజ మాత్రం కెమెరా కంటికి కనిపించేది తక్కువే అయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇక ఆమె మ్యారేజ్ లైఫ్ ఒడిదుడుకులను ఎదుర్కొన్న సంగతి విదితమే.

శ్రీజకు ఇప్పటికే రెండు వివాహాలు అయ్యాయి. నటుడు కళ్యాణ్ దేవ్‌తో ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. అయితే వీరికి విడాకులు అయ్యాయని మీడియా కోడై కూస్తుంది. దానికి కారణం ఆమె పుట్టింట్లోనే ఉండటమే కాకుండా, కళ్యాణ్‌కు సంబంధించిన పిక్స్ తన ఇన్ స్టా ఖాతాలో నుండి తీసేయడం. కానీ దీనిపై అటు కళ్యాణ్ దేవ్ కానీ శ్రీజ కానీ స్పందించలేదు. తన ఇద్దరి కుమార్తెలతో జీవిస్తున్న శ్రీజ.. టూర్స్, స్నేహితులతో చిల్ అవుతున్న ఫోటోలు, పిల్లలకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో కనిపిస్తుంది. శ్రీజ తాజాగా తన అమ్మ సురేఖ మీద ఓ కామెంట్ చేసింది. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఆమె పెట్టిన పోస్టు బట్టి అర్థమౌతుంది. తన అమ్మని బాక్సులో ఎగ్స్ పెట్టమని అడిగితే.. రకరకాల డిషెస్ చేసి పెట్టడంతో.. వాటిని ఇన్ స్టా స్టోరీలో చూపిస్తూ.. తాను ఒకటి అడిగితే.. అన్ని చేసి పెట్టిదంటూ పేర్కొంది. ఇది చూస్తే పిల్లల ఆకలి గురించి తల్లికి తెలుస్తుందని ఉరికనే అనలేదన్న నానుడి ఇట్టే గుర్తుకు రావడం ఖాయం.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet