Idream media
Idream media
రాజకీయ నాయకులు నిన్న మాట్లాడిన మాట.. ఈ రోజు మాట్లాడరంటారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీల సంగతి ఇక ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు. గెలిచేందుకు, అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోతారు. మరచిపోతారనడం కన్నా.. వాటిని కావాలనే పక్కనపెట్టేస్తారనడం సబబుగా ఉంటుంది. ఎవరైనా గుర్తు చేసినా.. ఏమీ ఎరగనట్లుగా వ్యవహరించే నాయకులను నిత్యం మనం చూస్తేనే ఉంటాం. ఈ తరహా నేతలు 90 శాతం మంది ఉంటారు.
అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీరు గమనిస్తే.. సగటు రాజకీయ నాయకుడుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీల అమలుపైనే ఆయన దృష్టి పెట్టారు. తన పరిధిలో ఉన్న హామీలలో దాదాపు 98 శాతం సీఎం వైఎస్ జగన్ అమలు చేసి.. ప్రజల మనన్నలను పొందారు. పోలవరం, విభజన హామీలు సహా ప్రత్యేక హోదా వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా.. వాటి అమలు కోసం వైఎస్ జగన్ నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా. అయితే గత చంద్రబాబు ప్రభుత్వం హోదాను వదిలేసి.. ప్రత్యేక ప్యాకేజీ అంటూ కొత్త పల్లవి ఎత్తుకుంది. ఓటుకు నోటు కేసు, చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ వంటి అంశాలతో చంద్రబాబు డిఫెన్స్‌లో పడిపోయారు. ముఖ్యంగా ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదాను తాకట్లు పెట్టారనే భావన ఇప్పటికీ ప్రజల్లో నెలకొంది. ప్రత్యేక హోదాతోపాటు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై ఉన్న హక్కును కూడా చంద్రబాబు ఏడాదికే వదిలేసుకుని విజయవాడ వచ్చారు.
Also Read : నారా లోకేష్ సింహంలా ఎప్పుడు మారారు..?
పారిశ్రామికంగా వెనుకబడి ఉన్న ఏపీకి.. ప్రత్యేక హోదా సంజీవని వంటిదని 2014 ఎన్నికల్లో అన్ని పార్టీల నేతలు మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని బీజేపీ పెద్దలు చెప్పారు. పది కాదు పదిహేనేళ్లు తెస్తామని టీడీపీ నేతలు చెప్పారు. సీన్ కట్ చేస్తే.. ఆ మాటలు మారిపోయాయి. హోదా సంజీవని అన్న వారే.. అదేమన్నా సంజీవనా..? అంటూ మాట్లాడారు. తమ స్వార్థ, స్వప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధిని ఫణంగా పెట్టారు.
2019 ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలోనూ.. వైఎస్ జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. హోదా వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ.. ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వారికి మన (వైసీపీ) అవసరం వస్తే.. హోదా తప్పక వస్తుదని చెప్పారు.
కానీ వైఎస్ జగన్ ఊహించింది జరగలేదు. బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనే.. ప్రత్యేక హోదాపై జగన్ మాట్లాడారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాకపోవడం మన దురదృష్టమన్నారు. బీజేపీకి పూర్తి మెజారిటీ రావడం వల్ల.. మనం ఒత్తిడి చేయలేమని, అయితే ప్రత్యేక హోదా ఇవ్వాలని అడుగుతూనే ఉంటామని చెప్పారు.
తాజాగా జాబ్ క్యాలెంటర్ విడుదల చేసే సమయంలోనూ సీఎం వైఎస్ జగన్.. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ప్రైవేటు రంగంలో భారీగా ఉద్యోగాలు వచ్చేవని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా గురించి ఎన్నికలకు ముందు, తర్వాత భిన్నమైన ప్రకటనలు చేసిన గత పాలకులకు భిన్నంగా వైఎస్ జగన్ తీరు ఉండడం గమనార్హం. ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉంటుందని సీఎం జగన్ తీరుతో స్పష్టమైంది. అది వచ్చే పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందనేదే తెలియాల్సిన అంశం.
Also Read : రఘురామరాజు రెండో కోణం ఆలోచించలేదా..?