iDreamPost
android-app
ios-app

Debut Heroines : కొత్త భామలతో కళకళలాడిన టాలీవుడ్

  • Published Dec 30, 2021 | 5:01 AM Updated Updated Dec 30, 2021 | 5:01 AM
Debut Heroines : కొత్త భామలతో కళకళలాడిన టాలీవుడ్

టాలీవుడ్ లో అసలే హీరోయిన్ల కొరత. అందుకే తమన్నా, కాజల్ లాంటి సీనియర్లకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే 2021లో చెప్పుకోదగ్గ డెబ్యూలు జరిగాయి. అందులోనూ కొందరు అందం పరంగానే కాకుండా టాలెంట్ తోనూ ఆకట్టుకోవడంతో కెరీర్ త్వరగానే సెట్ అవుతోంది. మరికొందరి అవకాశాలు ఆయా సినిమాల ఫలితాల మీద ఆధారపడి ఉంటున్నాయి. ఓసారి ఈ ఏడాదిలో ఎంట్రీ ఇచ్చి జెండా పాతేందుకు ప్రయత్నిస్తున్న ముద్దుగుమ్మల మీద ఓ లుక్ వేద్దాం

1. కృతి శెట్టి

కరోనాతో ప్రపంచం తల్లడిల్లుతున్న సమయంలో ఉప్పెన రూపంలో తనకు వచ్చిన అవకాశం బంగారు బాతు అవుతుందని కృతి శెట్టి బహుశా ఊహించిందో లేదో కానీ దర్శకుడు బుచ్చిబాబు, హీరో వైష్ణవ్ తేజ్ కన్నా తనే ఎక్కువ బిజీ అయ్యింది. ఇటీవలే వచ్చిన శ్యామ్ సింగ రాయ్ కూడా హిట్ క్యాటగిరిలో పడటంతో ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. నాగచైతన్యతో చేసిన బంగార్రాజు విడుదలకు సిద్ధంగా ఉండగా ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్-లింగుస్వామి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి

2. శ్రీలీల

వచ్చిన టాక్ కి కలెక్షన్లకు ఏ మాత్రం పొంతన లేకుండా లాభాలను ఇచ్చిన పెళ్ళిసందడి సినిమా విజయంలో ఇద్దరు కీలక భాగస్వాములు. ఒకరు కీరవాణి రెండు హీరోయిన్ శ్రీలీల. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి తన లుక్స్ డాన్స్ తెగ నచ్చేశాయి. దెబ్బకు రవితేజ ధమాకాలో ఛాన్స్ కొట్టేసింది. దీంతో పాటు ఇంకొన్ని అనౌన్స్ చేయాల్సిన క్రేజీ సినిమాలు లైనప్ లో ఉన్నాయి. అవకాశాలను చక్కగా వాడుకుంటే టాలీవుడ్ లో సెటిలైపోయే ఛాన్స్ పుష్కలంగా ఉంది.

3. శివాని రాజశేఖర్

వచ్చిన తొలి రెండు సినిమాలు ఓటిటిలోనే రిలీజైనప్పటికీ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ వారసురాలిగా శివాని నటనతో ఆకట్టుకుంది. అద్భుతంలో పెర్ఫార్మన్స్ విమర్శకులతో పాస్ మార్కులు వేయించుకోగా ఇటీవలే వచ్చిన డబ్యుడబ్ల్యుడబ్ల్యు కూడా యాక్టింగ్ పరంగా ప్రసంశలు తెచ్చింది. గ్లామర్ ఫ్యాక్టర్ తక్కువగా ఉన్నా ఛాలెంజింగ్ రోల్స్ పడితే మాత్రం తల్లి జీవిత లాగా గుర్తుండిపోయే మంచి పాత్రలు వస్తాయి. నిర్మాణంలో ఉన్న మరో రెండు సినిమాలు థియేటర్లోనే రాబోతున్నాయి.

4. ఫరియా అబ్దుల్లా

జాతిరత్నాలు లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో ఎంట్రీ ఇచ్చిన ఫరియా అందులో నటనతో నవీన్ పోలిశెట్టి లాంటి ఎనర్జీ హౌస్ కు ధీటుగా మెప్పించి ఆడియన్స్ ని ఒప్పించింది. వరసగా అవకాశాలు క్యూ కట్టనప్పటికీ స్లో అండ్ స్టడీ సూత్రాన్ని పాటిస్తూ సినిమాలను ఎంచుకుంటోంది. బంగార్రాజులో ఇటీవలే ఒక స్పెషల్ సాంగ్ కూడా చేసింది. సంతోష్ శోభన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో తనే ఎంపికైనట్టుగా సమాచారం. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు

5. మరికొందరు

వీళ్ళు కాకుండా తెలుగు సినిమాకు పరిచయమైన అమ్మాయిల లిస్టు గట్టిగానే ఉంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలాతో వచ్చిన అమ్రితా అయ్యర్ కు మెల్లగా అవకాశాలు పెరుగుతున్నాయి. కన్నుగీటు సుందరి ప్రియా ప్రకాష్ వారియర్ చెక్ తో స్ట్రెయిట్ ఎంట్రీ ఇచ్చింది కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఇష్క్ డిజాస్టర్ అయ్యింది. కషిష్ ఖాన్ (అనుభవించు రాజా), మీనాక్షి చౌదరి (ఇచట వాహనుములు నిలుపరాదు), దృశ్య రఘునాధ్ (షాదీ ముబారక్), తాన్యా రవిచంద్ర(రాజా విక్రమార్క)లు బడ్జెట్ మూవీస్ ని టార్గెట్ గా పెట్టుకుని కెరీర్ ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఒక్క బ్లాక్ బస్టర్ పడితే వీళ్ళ జాతకాలు మారిపోతాయి.

Also Read : Action King Arjun : స్టయిలిష్ విలన్ ని సెట్ చేస్తున్న గోపీచంద్

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş