భారత్ ఓటమి.. మొదటి T20 మ్యాచ్ ని గెలిచిన దక్షిణాఫ్రికా..

ప్రస్తుతం యువ ఆటగాళ్లతో టీమిండియా దక్షిణాఫ్రికాతో ఐదు T20 మ్యాచ్‌ల సిరీస్‌ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ మొదటి మ్యాచ్ జరగగా ఇందులో భారత్‌ ఓటమి పాలయింది. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి T20 మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్‌ఇండియా 20 ఓవర్లలో 211 పరుగులు చేసి భారీ టార్గెట్ ఇచ్చింది. అయినా దక్షిణాఫ్రికా ఆ లక్షాన్ని ఈజీగా ఛేదించింది. 212 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా కేవలం మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలోనే ఛేదించి గెలుపొందింది.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్ తరపున ఇషాన్‌ కిషన్‌ (76; 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్ (36; 27 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) రాణించారు. రుతురాజ్‌ గైక్వాడ్ (23; 15 బంతుల్లో 3 సిక్స్‌లు), కెప్టెన్ రిషభ్ పంత్‌ (29; 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్ పాండ్య (31; 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.

ఇక ఛేజింగ్ కి దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లలో డేవిడ్‌ మిల్లర్ (64; 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), డస్సెన్ (75; 46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ శతకాలతో చెలరేగారు. మిల్లర్‌ కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికా మిగతా బ్యాటర్లలో డికాక్‌ (22), బవుమా (10), ప్రిటోరియస్‌ (29) పరుగులు చేశారు. మొదటి మ్యాచ్ ని ఓటమితో మొదలు పెట్టిన భారత్ మున్ముందు ఎలా ఆడుతుందో అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.

 

Show comments