Vinay Kola
Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీకి ప్రతిష్టాత్మక టోర్నీగా సూపర్ క్రేజ్ ఉంది. దులీప్ టోర్నీని ఈ ఏడాది బీసీసీఐ చాలా గ్రాండ్ గా జరుపుతున్న సంగతి తెలిసిందే.
Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీకి ప్రతిష్టాత్మక టోర్నీగా సూపర్ క్రేజ్ ఉంది. దులీప్ టోర్నీని ఈ ఏడాది బీసీసీఐ చాలా గ్రాండ్ గా జరుపుతున్న సంగతి తెలిసిందే.
Vinay Kola
దులీప్ ట్రోఫీకి దేశవాళి క్రికెట్‌లో ప్రతిష్టాత్మక టోర్నీగా సూపర్ క్రేజ్ ఉంది. ఈ టోర్నీని ఈ ఏడాది బీసీసీఐ చాలా గ్రాండ్ గా జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ మొదలైన దగ్గర నుంచి జరుగుతున్న విధానాన్ని మార్చి.. కొత్త పద్ధతిలో జరిపేందుకు బీసీసీఐ రెడీ అయింది. అయితే ఇప్పటిదాకా 6 జట్ల మధ్య జరిగిన ఈ టోర్నీని.. ఈ సారి మాత్రం 4 జట్లతోనే జరపనుంది. ఇంటర్నేషనల్ లెవెల్ లో జరిగే క్రికెట్‌లో మెరుగ్గా ఆడేందుకు టీమిండియా యువ క్రికెటర్లకు ఈ టోర్నీ బాగా ఉపయోగపడుతుంది. దీనిని యువ క్రికెటర్లకు ఒక పరీక్షల నిర్వహిస్తోంది బీసీసీఐ. ఈ టోర్నీలో మన టీమిండియా స్టార్ క్రికెటర్లు, యువ క్రికెటర్లు ఆడుతున్నారు. అందువలన దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. దేశం నలుమూలల వున్న క్రికెట్ అభిమానులు అంతా కూడా ఈ టోర్నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ టోర్నీ మొదలవుతుంది. 19 వరకు ఈ మ్యాచ్‌లు కొనసాగుతాయి. ఇక ఈ టోర్నీ కోసం అనంతపురంలో ఫ్రీ టికెట్స్ ఇచ్చేనందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. క్యూ లైన్లో నుంచొని ఫ్రీ టికెట్ల కోసం ఎగబడుతున్నారు. పోలీసులు కూడా వీరిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఓ పోలీస్ అధికారి ఓ యువకుడిని లాఠీతో కొట్టబోతున్న దృశ్యం మనం వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Duleep Trophy Free Tickets Situation at Anantapur. pic.twitter.com/4k7cZZNWib
— CricketGully (@thecricketgully) September 1, 2024