iDreamPost
android-app
ios-app

Sooryavanshi : సూర్యవంశీ రిపోర్ట్

Sooryavanshi  :  సూర్యవంశీ రిపోర్ట్

నిన్న రాత్రి దాకా మల్టీ ప్లెక్సులతో వచ్చిన రెవిన్యూ షేరింగ్ గొడవతో అడ్వాన్ బుకింగ్ బాగా లేట్ అయిన అక్షయ్ కుమార్ మల్టీ స్టారర్ సూర్యవంశీ ఎట్టకేలకు వాటిని అధిగమించి ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. ఏడాదిన్నరకు పైగా తీవ్ర సంక్షోభంలో ఉన్న బాలీవుడ్ కు ఇదే ఊపిరిస్తుందని ట్రేడ్ చాలా నమ్మకంగా ఉంది. దానికి తగ్గట్టే భారీ రిలీజ్ కు ప్లాన్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు పై వివాదం వల్ల అనుకున్న స్థాయిలో టికెట్లు అమ్ముడుపోకపోవడంతో ఆక్యుపెన్సీ తక్కువగానే నమోదయ్యిందట. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ పోలీస్ ఎంటర్ టైనర్ లో అజయ్ దేవగన్ రణ్వీర్ సింగ్ లు కూడా ఉన్నారు. మరి ఇదెలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

1993 ముంబైలో జరిగిన బాంబు బ్లాస్ట్ లో వాడిన ఆర్డిఎక్స్ లో కొంత భాగం మిస్ అవుతుంది. దానితో సంబంధం ఉండి తప్పించుకు పారిపోయివాళ్ళు దాన్ని ఎక్కడో దాచి పెడతారు. కానీ పోలీసులకు ఆచూకీ దొరకదు. ఈ కేసులో భాగమైన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వీర్ సూర్యవంశీ(అక్షయ్ కుమార్)ఆ ఎక్స్ ప్లోజివ్స్ ని వెతికే పనిలో ఉంటాడు. వాటిని మళ్ళీ వాడి మరోసారి వరస పేలుళ్లకు ప్లాన్ చేశారని తెలుసుకుంటాడు. ఈ క్రమంలో ఇతనితో గతంలో పని చేసిన సహచరులు సింబ(రణ్వీర్ సింగ్)సింగం(అజయ్ దేవగన్)లు తోడొస్తారు. మరి సూర్యవంశీ పెట్టుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు, ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాడు అనేదే మిగిలిన కథ

దర్శకుడు రోహిత్ శెట్టి ఇంకా సింగం హ్యాంగోవర్ లోనే ఉన్నారు. ఆ ఫార్ములా ఒరిజినల్ తమిళంలోనే ఫేడ్ అవుట్ అయ్యింది. తిరిగి దాన్నే తీసుకుని ఇంకా గ్రాండ్ స్కేల్ లో సూర్యవంశీని రాసుకున్నాడు. కాకపోతే ట్రైలర్ లో చూసినంత గ్రాండియర్ గా అసలు సినిమా ఉండదు. చాలా చోట్ల విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ లో రాజీ పడటం క్వాలిటీని దెబ్బ తీసింది. అక్షయ్ శతవిధాలా నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ రోహిత్ శెట్టి ఆలోచనలు పదేళ్లు వెనక్కి ఉండటంతో ఆశించిన ఫలితం దక్కలేదు. కత్రినా కైఫ్ అందంగానే ఉంది కానీ కంటెంట్ పరంగా ఉపయోగపడింది లేదు. రొటీన్ గా ఉన్నా పర్లేదు, ఎమోషన్స్ లేకపోయినా అడ్జస్ట్ అవుతాం, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటే చాలు అనుకుంటే సూర్యవంశీని ట్రై చేయొచ్చు. కాకపోతే అంచనాలను బాగా కట్ షార్ట్ చేసుకోవాలి.

Also Read : Festival Collections : పండగ వసూళ్లు ఎంత వచ్చాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి