iDreamPost
android-app
ios-app

భర్తతో కలిసి ఉండలేను అంటున్న మహిళకు గమ్మత్తైన సమాధానం ఇచ్చిన సోనూసూద్

భర్తతో కలిసి ఉండలేను అంటున్న మహిళకు గమ్మత్తైన సమాధానం ఇచ్చిన సోనూసూద్

సినిమాల్లో విలన్ వేషాలు వేసినా, నిజ జీవితంలో మాత్రం తన సేవతో హీరో అయ్యారు నటుడు సోనూసూద్..ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను మానవతా దృక్పథంతో స్వస్థలాలకు చేర్చడంలో సోనూసూద్ పాత్ర అమోఘం.. కొందరిని బస్సుల్లో తరలించగా కేరళలోని ఏర్నాకులంలో చిక్కుకున్న దాదాపు 180 మందిని ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మరీ వారిని స్వస్థలానికి చేర్చారు. దీంతో సోషల్ మీడియాతో పాటు దేశవ్యాప్తంగా సోనూసూద్ కి ప్రశంసలు దక్కుతున్నాయి. సోనూసూద్ చేసిన సాయంతో స్వస్థలానికి చేరిన ఒక మహిళ తనకు పుట్టిన బాబుకు “సోనూసూద్ శ్రీవాత్సవ” అని పేరు పెట్టుకున్న విషయం కూడా తెలిసిందే.

ఇదిలా ఉంటే కొందరు మాత్రం విచిత్రమైన కోరికలు కోరుతూ సోనూసూద్ ని సహాయం చేయమని అభ్యర్దిస్తున్నారు. తనకు సహాయం చేయమని సుష్రిమా ఆచార్య అనే మహిళ ట్విట్టర్ ద్వారా సోనూసూద్ ని కోరింది. కానీ ఈ సహాయం చేయమనడంలోనే ఒక మెలిక ఉంది. తన భర్తతో కలిసి ఉండలేకపోతున్నానని దయచేసి మా ఇద్దరిని వేరు చేయమని ఆ సుష్రిమా ఆచార్య కోరింది. ఆమె చేసిన ట్వీట్ కి సోనూసూద్ కూడా తెలివిగా రిప్లై ఇచ్చాడు. ఒకసారి ఆమె చేసిన ట్వీట్ ని గమనిస్తే…”సోనూసూద్‌.. జనతా కర్ఫ్యూ నుంచి లాక్‌డౌన్‌-4 వరకు నేను నా భర్తతోనే ఉంటున్నాను. ఇప్పుడు అతన్ని బయటకు పంపించండి. లేదా నన్ను మా అమ్మ వాళ్ల ఇంటికి పంపించగలరా.. ఎందుకంటే ఇకపై నేను అతనితో కలిసి ఉండలేను” అని ట్విట్టర్ ద్వారా సోనూసూద్ ని కోరడంతో గమ్మత్తుగా జవాబు ఇచ్చాడు సోనూసూద్..

“నా దగ్గర ఓ మంచి ప్లాన్‌ ఉంది. మీ ఇద్దరిని గోవా పంపిద్దాం.  ఏమంటారు” అంటూ సోనూసూద్ ఆ మహిళకు బదులిచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొత్త ప్రదేశంలో భార్య భర్తలు తిరిగి కలుస్తారని సోనూసూద్ ఉదేశ్యం అయి ఉండొచ్చు. ఇప్పుడు సోనూసూద్ చేసిన ట్వీట్ 1568 రీట్వీట్స్ అవ్వగా దాదాపు 21,600 లైక్స్ దక్కించుకుని ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.. ఏదిఏమైనా లాక్‌డౌన్‌ సమయంలో సోనూసూద్ వలస కూలీలకు చేసిన సాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఆ ప్రశంసలు పొందడానికి అన్నివిధాల సోనూసూద్ అర్హుడే..