iDreamPost
android-app
ios-app

ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం – సోనియా

ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం – సోనియా

కరోనా నేపధ్యంలో 21 రోజుల లాక్ డౌన్ కాలంలో తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని సోనియా తన లేఖలో పేర్కొంటూ. కరోనా మహమ్మారి రూపం దాల్చి ప్రపంచాన్ని తుడిచిపెట్టేంత స్థాయిలో విజృంభిస్తోందని, ఇలాంటి సమయంలో కేంద్రం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్రం తీసుకునే చర్యలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని,కేరళ తరహాలో ప్రతిపక్షాలను కూడా ఈ బాధ్యతలో భాగస్వామ్యం చేయాలని ఆమె కోరారు..

కరోనాపై పోరాటంలో కీలకంగా నిలుస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి ఎన్-95 మాస్కులు, రక్షణ సూట్లు వంటి రక్షణ కల్పించే వస్తు సామగ్రిని తక్షణమే అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్య సిబ్బంది రక్షణకు పూర్తిగా కల్పించే విధంగా చర్యలు తీసుకోని వారికి భరోసా కల్పించాలని ఆమె కోరారు.

ప్రపంచ దేశాలలో వెల్లువలా వస్తున్న కరోనా పేషెంట్ల తాకిడిని తట్టుకోలేక మరణిస్తున్నారని,, భారత దేశంలో లో అలాంటి పరిస్థితి రాకుండా తగిన విధంగా ఆసుపత్రిలను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేసి అందుబాటులో ఉండేలా ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఐసీయూలు, వెంటిలేటర్లు కలిగివుండే తాత్కాలిక వైద్య శిబిరాలను నిర్మించాలని సోనియా తన లేఖలో తెలిపారు.

ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతుల నుంచి రుణచెల్లింపులను ఓ ఆరు నెలల పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. 21 రోజుల లాక్ డౌన్ కాలంలో ప్రజలకు చేయూతనిచ్చే క్రమంలో ప్రతి జన్ ధన్ ఖాతాదారుకు, ప్రతి పీఎం కిసాన్ యోజన్ ఖాతాదారుకు, వృద్ధాప్య, వితంతు పెన్షన్ దారులకు, ఉపాధి హామీ పథకం కూలీలకు ప్రతి ఒక్కరికీ రూ.7,500 చొప్పున ఖాతాలో వేయాలని సూచించారు. రేషన్ దుకాణాల ద్వారా ఒక్కో కార్డుదారుడికి 10 కిలోల బియ్యం లేక 10 కిలోల గోధుమలు ఉచితంగా సరఫరా చేయాలని కోరారు

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alJojobet girişJojobet girişberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş